Share News

దేశంలో అసమానతలకు మనుస్మృతే కారణం

ABN , Publish Date - Dec 26 , 2023 | 12:06 AM

ప్రపంచంలో ఎక్క డా లేనంతగా భారతదేశంలోనే సామాజిక అసమానతలను సృష్టించి, వివక్షకు మనుధర్మ శా స్త్రమే కారణమని కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు పాలడుగు నాగార్జున, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు అన్నారు.

 దేశంలో అసమానతలకు మనుస్మృతే కారణం
ప్రతులను దహనం చేస్తున్న ప్రజా సంఘాల నాయకులు

దేశంలో అసమానతలకు మనుస్మృతే కారణం

నల్లగొండ, నల్లగొండరూరల్‌, దేవరకొండ, డిసెంబరు 25: ప్రపంచంలో ఎక్క డా లేనంతగా భారతదేశంలోనే సామాజిక అసమానతలను సృష్టించి, వివక్షకు మనుధర్మ శా స్త్రమే కారణమని కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు పాలడుగు నాగార్జున, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం ముందు సామాజిక ప్రజా సంఘాలు కేవీపీఎస్‌, తెవివే, ఎమ్మెస్పీ, టీ పీఈఎస్‌, పీవైఎల్‌, మాలమహానాడు సంఘాల ఆధ్వర్యంలో మనుధర్మ శాస్త్రానికి సంబంధించిన ప్రతులను దహనం చేశారు. అ సంబద్ధమైన, అనాగరికమైన ఆలోచనల ద్వారా వేయి సంవత్సరాలుగా మనుషుల మధ్య సామాజిక అంతరాలు సృష్టించింది మనుస్మృతేనని వారు పేర్కొన్నారు.

దేవరకొండ పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సోమవారం ప్రజా సం ఘాల ఆధ్వర్యంలో మనుస్మృతి ప్రతులను దహనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో వివిధ ప్రజా సంఘాల నాయకులు పుచ్చకాయల నర్సిరెడ్డి, ఇందూరి సాగర్‌, మానుపాటి భిక్షమ య్య, కోట్ల అశోక్‌రెడ్డి, గోలి సైదులు, కట్టెల శివకుమార్‌, గాదె నర్సింహ, దండెపల్లి సత్తయ్య, దేవరకొండలో ప్రజా సంఘాల నాయకులు డాక్టర్‌ ఏకుల రాజారావు, కమలపల్లి వెంకట య్య, డాక్టర్‌ చింతపల్లి శ్రీనివా్‌సగౌడ్‌, లింగంపల్లి మధు, చొల్లేటి బాస్కరాచారి, సైదులు, వ నం శ్రీను, రాములు, రవీందర్‌, లలిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 12:06 AM