బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా మల్లేష్‌

ABN , First Publish Date - 2023-06-24T00:32:39+05:30 IST

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా మునుగోడు నియోజకవర్గానికి చెందిన నేరటి మల్లే్‌షయాదవ్‌ను నియమిస్తూ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గండిచెరువు వెంకన్నగౌడ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

 బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా  మల్లేష్‌
నియామక పత్రం అందజేస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు వెంకన్నగౌడ్‌

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా మల్లేష్‌

నల్లగొండటౌన, జూన 23: బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా మునుగోడు నియోజకవర్గానికి చెందిన నేరటి మల్లే్‌షయాదవ్‌ను నియమిస్తూ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గండిచెరువు వెంకన్నగౌడ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం నియామక ఉత్తర్వులను ఆయ న అందజేసి మాట్లాడారు. బీసీల సమస్యలపై నిరంతరం పోరాడాలని, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నారు. బీసీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రూ.1లక్ష సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లే్‌షయాదవ్‌ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీల సమస్యల పట్ల రాజీలేని పోరాటం చేస్తానని పేర్కొన్నారు.

Updated Date - 2023-06-24T00:32:39+05:30 IST