నల్లగొండను సుందరవనంగా తీర్చిదిద్దుతా : కంచర్ల
ABN , First Publish Date - 2023-01-18T00:44:16+05:30 IST
నల్లగొండ ను సుందరవనంగా తీ ర్చిదిద్దుతానని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులకు సీఎం రి లీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు.
నల్లగొండను సుందరవనంగా తీర్చిదిద్దుతా : కంచర్ల
నల్లగొండ రూరల్, జనవరి 17: నల్లగొండ ను సుందరవనంగా తీ ర్చిదిద్దుతానని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులకు సీఎం రి లీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. నల్లగొండ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ. 11 వందల కోట్లు కేటాయించడంతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నియోజ కవర్గానికి చెందిన 303 మంది లబ్ధిదారులకు రూ.1.35కోట్ల విలువైన చెక్కులను అందజేసినట్లు తెలిపారు. అదేవిధంగా మాడ్గులపల్లి మండలానికి చెందిన 15 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబార్ చెక్కులను అందజేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశప్రజలందరూ కోరుకుంటున్నందున కే సీఆర్ బీఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని తెలిపారు. మాడ్గులపల్లి: గ్రామీణ క్రీ డలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో నాయకులు నిరంజనవలి, కటికం సత్తయ్యగౌడ్, అబ్బగోని రమేష్, కరీం పాషా, విజయలక్ష్మి, సంపతరెడ్డి, సహదేవరెడ్డి, శ్రీనివాస్, అభిమన్యు శ్రీనివాస్, ర వీందర్‌రెడ్డి, దేప వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాడ్గులపల్లి: మండల కేంద్రంలో యువసేన యూత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలను ఆయన తిలకించి మాట్లాడారు. క్రీడాకారులు రాష్ట్ర, జాతీ య స్థాయిల్లో తమ సత్తాను చాటాలన్నారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ నాయకు లు పూనం రవిరెడ్డి, ఏడుకొండలు, నరేందర్‌రెడ్డి ఉన్నారు.