Share News

TRS MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటివరకు బయటకు రాని విషయాలు చెప్పిన ప్రధాన నిందితుడు నందు

ABN , Publish Date - Dec 29 , 2023 | 12:17 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫాంహౌ్‌స్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నందకుమార్‌ అలియాస్‌ నందు ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడారు. దాదాపు ఏడాది తర్వాత ఈ కేసుపై నోరు విప్పిన ఆయన ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ కేసులో తాను బాధితుడిని మాత్రమేనని అన్నారు.

TRS MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటివరకు బయటకు రాని విషయాలు చెప్పిన ప్రధాన నిందితుడు నందు

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫాంహౌ్‌స్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నందకుమార్‌ అలియాస్‌ నందు ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడారు. దాదాపు ఏడాది తర్వాత ఈ కేసుపై నోరు విప్పిన ఆయన ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ కేసులో తాను బాధితుడిని మాత్రమేనని అన్నారు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉన్నందున కొన్ని విషయాలను మాత్రమే వెల్లడిస్తున్నట్లు చెప్పారు. ‘‘‘ కేసులో నేను నిందితుడిని కాదు. బాధితుడిని. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి.. దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ను నిర్వహిస్తున్నాను. ఆ హోటల్‌ను నేలమట్టం చేయడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యాను. నాకు పార్టీలకు అతీతంగా ఏపీ, తెలంగాణకు చెందిన 50 మంది దాకా ఎమ్మెల్యేలు తెలుసు. పైలెట్‌ రోహిత్‌ రెడ్డితో ముందు నుంచి పరిచయం ఉంది’’ అని చెప్పారు. ఇప్పటి వరకు బయటకు రాని పలు ఆసక్తికర విషయాలను ఆయన వెల్లడించారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.

Updated Date - Dec 29 , 2023 | 12:17 PM