Share News

మేడిగడ్డపై ఎల్‌ అండ్‌ టీ లేఖ కుట్ర పూరితం

ABN , Publish Date - Dec 17 , 2023 | 04:50 AM

మేడిగడ్డ పునరుద్దరణ తమ బాధ్యత కాదంటూ ఎల్‌ అండ్‌ టీ సంస్థ లేఖ రాయడం కుట్ర పూరితమని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాన్ని నిగ్గు తేల్చాలని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ కోరారు.

మేడిగడ్డపై ఎల్‌ అండ్‌ టీ లేఖ కుట్ర పూరితం

ప్రభుత్వం మారడంతో విధానం మారిందా?

టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌

హైదరాబాద్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : మేడిగడ్డ పునరుద్దరణ తమ బాధ్యత కాదంటూ ఎల్‌ అండ్‌ టీ సంస్థ లేఖ రాయడం కుట్ర పూరితమని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాన్ని నిగ్గు తేల్చాలని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ కోరారు. గాంధీభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బరాజ్‌ కుంగినప్పుడు తామే పునర్‌నిర్మిస్తామంటూ జనరల్‌ మేనేజర్‌ ద్వారా ప్రకటించిన సంస్థ ఇప్పుడు మాట మార్చడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం మారినందున ఆ సంస్థ విధానంలో మార్పు వచ్చిందా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఆ పని చేయాలంటే అనుబంధ ఒప్పందం చేసుకోవాలనడంలోని ఔచిత్యం ఏంటన్నారు.

సీఎంను కలిసిన జైరాం రమేష్‌

సీడబ్ల్యుసీ సభ్యుడు జైరాం రమేష్‌ శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని అసెంబ్లీలోని ఆయన చాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డిని ఆయన అభినందించారు. రాహుల్‌కు సన్నిహితుడిగా పేరున్న జైరాం.. అసెంబ్లీకి వచ్చి సీఎం రేవంత్‌ను కలవడం ఆసక్తిని రేకెత్తించింది.

ఇందిర ఉక్కు సంకల్పంతోనే బంగ్లాదేశ్‌ ఏర్పాటు : మహే్‌షకుమార్‌ గౌడ్‌

దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఉక్కు సంకల్పంతోనే బంగ్లాదేశ్‌ ఏర్పడిందని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మహే్‌షకుమార్‌ గౌడ్‌ అన్నారు. గాంధీభవన్‌లో శనివారం బంగ్లాదేశ్‌ లిబరేషన్‌ వార్‌-1971 విజయోత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవంలో పార్టీ నేతలు మహే్‌షకుమార్‌ గౌడ్‌, కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహే్‌షకుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ బంగ్లాదేశ్‌ విముక్తికి జరిగిన యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్‌తో పోరాడి విజయం సాధించిందని, బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించిందని అన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 06:43 AM