ఆంక్షలను దాటుకొని వచ్చిన అభిమానం

ABN , First Publish Date - 2023-09-18T04:36:47+05:30 IST

డీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి.

ఆంక్షలను దాటుకొని వచ్చిన అభిమానం

బాబు అరె్‌స్టను ఖండిస్తూ కొనసాగిన నిరసనలు

భారీగా కదిలిన అభిమానులు, ఐటీ ఉద్యోగులు

ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సంఘీభావం

జర్మనీలో నిరసన ప్రదర్శన

టీడీపీ అధినేత చంద్రబాబు అరె్‌స్టను ఖండిస్తూ కొనసాగిన ర్యాలీలు, నిరసనలు

తరలివచ్చిన అభిమానులు, ఐటీఉద్యోగులు, టీడీపీ శ్రేణులు

ర్యాలీల్లో పాల్గొన్న నందమూరి సుహాసిని

హైదరాబాద్‌ సిటీ/వనస్థలిపురం/ వెంగళ్‌రావునగర్‌/నార్సింగ్‌/ఖమ్మం, భద్రాచలం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. టీడీపీ శ్రేణులు, బాబు అభిమానులు మాత్రమే కాదు.. బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులూ ఈ ర్యాలీల్లో పాల్గొంటున్నారు. పోలీసు నిర్భందాలను దాటుకొని స్వచ్ఛందంగా ప్రజలు చంద్రబాబుకు అండగా నిలుస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అరాచక పాలనను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎల్బీనగర్‌లో జరిగిన ర్యాలీలో ఎల్బీనగర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బీజేపీ కార్పొరేటర్‌ కొప్పుల నరసింహారెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబును జైలు పాలు చేయటం దారుణమని సుధీర్‌ రెడ్డి అన్నారు. తొలుత టీడీపీ శ్రేణులు, అభిమానులు పనామా సర్కిల్‌ నుంచి ప్రారంభించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులు పోలీసులను నెట్టుకుంటూ ముందుకు కదిలారు. వారికి మద్దతుగా కార్పొరేటర్లు కొప్పుల నర్సింహారెడ్డి, వంగా మధుసూదన్‌రెడ్డి వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చంద్రబాబు వల్లనే తాను లీడర్‌ను అయ్యానని, తాను బీజేపీలో ఉన్నా చంద్రబాబుకు మద్దతు తెలుపడానికి వచ్చానని నర్సింహారెడ్డి తెలిపారు. పోలీసులు అడ్డుకోవటంపై ర్యాలీ నిర్వాహకులు స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే నిరసన ర్యాలీకి ఇబ్బందులు కలిగించకూడని పోలీసులకు సూచించడంతో వారు వెనక్కి తగ్గారు.

ఏపీలో ఓటర్లుగా నమోదు చేసుకొని బాబును గెలిపిద్దాం

ఐటీ ఉద్యోగి సునీత అధ్యక్షతన ఆదివారం మధురానగర్‌ సాగీ రామకృష్ణంరాజు కమ్యూనిటీ హాలులో బాబుకు మద్దతుగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులు, ఐటీ ఉద్యోగులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన టీటీడీపీ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని.. ఏపీలో టీడీపీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారన్నారు. చంద్రబాబు విజన్‌ వల్లనే నేడు తెలుగు రాష్ర్టాలలో ఇంటికొకరికి ఐటీఉద్యోగం వచ్చిందని ఐటీ ఉద్యోగి సునీత అన్నారు. ఆయనకు మద్దతుగా ర్యాలీలో పాల్గొంటే తన పైన కూడా కేసు పెట్టారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించడానికి అందరం ఏపీలో ఓటర్లుగా నమోదు చేసుకుని, ఓటు శక్తి ద్వారా సత్తా చూపుదామన్నారు. విజన్‌ ఉన్న గొప్ప నాయకుడు చంద్రబాబు అని బీజేపీ హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్‌ కిలారి మనోహర్‌ అన్నారు.

మూసాపేట సమీపంలోని రెయిన్‌బో విస్టా గేటెడ్‌ కమ్యూనిటీ వద్ద అభిమానులు, టీడీపీ శ్రేణులు ఐయామ్‌ విత్‌ సీబీఎన్‌ పేరుతో ఆందోళన చేపట్టారు. గ్రీన్‌హిల్స్‌ రోడ్డులో ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకోవడంతో రెయిన్‌బో విస్టా గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కేపీహెచ్‌బీ వసంత్‌నగర్‌లో ఐ యామ్‌ విత్‌ సీబీఎన్‌ పేరుతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. నందమూరి సుహాసిని, కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. బొటానికల్‌ గార్డెన్‌లో వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు విడుదల కోసం నిజాంపేట వరసిద్ధి వినాయక ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. మణికొండ మున్సిపాలిటీ పంచవటి కాలనీలో జరిగిన ర్యాలీలో నందమూరి సుహాసినితోపాటు టీడీపీ నాయకులు, అభిమానులు, శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ రామాలయం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. మోతీనగర్‌, రాజీవ్‌ నగర్‌లలోని టీడీపీ అభిమానులు నిరసనలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మలక్‌పేటలోని ఆంజనేయస్వామి ఆలయంలో టీడీపీ నేతలు పూజలు జరిపారు. చిత్రపురి కాలనీలో చంద్రబాబు అభిమానులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మణికొండ కౌన్సిలర్‌ వల్లభనేని హనుమాంజలి పాల్గొన్నారు.

ఖమ్మం గుమ్మంలో కదం తొక్కారు

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఖమ్మం గుమ్మంలో అభిమానులు కదం తొక్కారు. పార్టీలకతీతంగా వేలాదిగా తరలివచ్చిన మహిళలు, యువకులు, అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివారం సాయంత్రం ఖమ్మం బైపా్‌సరోడ్డులోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ఎన్టీఆర్‌ మనవడు నందమూరి చైతన్యకృష్ణ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి చంద్రబాబు సంఘీభావ యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నేతలు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు.

నిరసనలను ఉధృతం చేస్తాం: కాసాని

చంద్రబాబు అక్రమ అరె్‌స్టను నిరసిస్తూ గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆందోళనలు, నిరసనలు ఉధృతం చేయనున్నట్లు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ తెలిపారు. ఆదివారం టీడీపీ గ్రేటర్‌ నాయకులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. చంద్రబాబు అక్రమ అరె్‌స్టను ప్రజల్లోకి తీసుకెళ్లి... జగన్‌ రాక్షస పాలనను తెలియజేయాలని సూచించారు. చంద్రబాబు అరె్‌స్టను తెలుగుప్రజలందరూ ఖండించి తమకు అండగా నిలవాలని కోరారు.

Updated Date - 2023-09-18T04:36:47+05:30 IST