క్యూబాలో పేదోళ్లలాగా జీవించి ధనికుల్లా చనిపోతారు: అలైదా

ABN , First Publish Date - 2023-01-22T20:21:31+05:30 IST

క్యూబాలో పేదోళ్లలాగా జీవించి ధనికుల్లా చనిపోతారని చే గువేరా కుమార్తె అలైదా గువేరా (Alaida Guevara) వెల్లడించారు. క్యూబాలో పేదోళ్లలానే బతుకుతామన్నారు.

క్యూబాలో పేదోళ్లలాగా జీవించి ధనికుల్లా చనిపోతారు: అలైదా

హైదరాబాద్: క్యూబాలో పేదోళ్లలాగా జీవించి ధనికుల్లా చనిపోతారని చే గువేరా కుమార్తె అలైదా గువేరా (Alaida Guevara) వెల్లడించారు. క్యూబాలో పేదోళ్లలానే బతుకుతామన్నారు. క్యూబా (Cuba) విప్లవయోధుడు చే గువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ప్రొ.ఎస్తిఫినా గువేరా ఆదివారం హైదరాబాద్ వచ్చారు. నేషనల్‌ కమిటీ ఫర్‌ సాలిడారిటీ విత్‌ క్యూబా(ఎన్‌సీఎస్‌సీ) ఆధ్వర్యంలో రవీంధ్రభారతిలో జరిగే ‘క్యూబా సంఘీభావ సభ’కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అలైదా గువేరా మాట్లాడుతూ క్యూబా సోషలిస్టు దేశమన్నారు. చే గువేరా (Che Guevara)ను కేవలం టీ షర్ట్స్, పొటోలలో మాత్రమే కాదు.. ఆయన ఆదర్శాలను మనమంతా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.

‘‘నేను క్యూబా సాధారణ మహిళను.. ప్రత్యేకమేమీ కాదు. మనం అందరినీ సమానత్వంతో చూడాలి. చేగువేరా చేసిన విప్లవాన్ని మనం ఆచరించాలి. నాన్న చేగువేరా.. సామాజిక సేవలో ముందుండే వారు. క్యూబాలో మహిళా ఫెడరేషన్ ఉంటుంది. ఆడ, మగ అనే వ్యత్యాసం ఉండదు. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తారు’’ అని అలైదా గువేరా తెలిపారు.

Updated Date - 2023-01-22T20:21:33+05:30 IST