నేడు, రేపు తేలికపాటి వర్షాలు
ABN , First Publish Date - 2023-08-03T04:00:26+05:30 IST
రాష్ట్రంలో రెండ్రోజుల పాటు (గురు, శుక్రవారాల్లో) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రాష్ట్రంలో రెండ్రోజుల పాటు (గురు, శుక్రవారాల్లో) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. బుధవారం కరీంనగర్ పట్టణంలో 19 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఈ నెల 1 వరకు రాష్ట్రవ్యాప్తంగా 290 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమో దవాల్సి ఉండగా, 462 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వివరించింది.