Share News

నైతిక విలువలతోనే జీవన నైపుణ్యాలు

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:00 AM

పాఠశాల స్థాయిలోనే నైతిక విలువతో కూడిన జీవన నైపుణ్యాలు పెంచుకోవాలని బెంగుళూరుకు చెందిన ఇస్కాన ప్రచారకులు నవీనకుమార్‌, సమీర్‌ అన్నారు.

నైతిక విలువలతోనే జీవన నైపుణ్యాలు
విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తున్న ప్రచారక్‌లు నవీన, సమీర్‌

కోదాడ రూరల్‌, డిసెంబరు 16 : పాఠశాల స్థాయిలోనే నైతిక విలువతో కూడిన జీవన నైపుణ్యాలు పెంచుకోవాలని బెంగుళూరుకు చెందిన ఇస్కాన ప్రచారకులు నవీనకుమార్‌, సమీర్‌ అన్నారు. మండలంలోని కొమరబండ తేజ విద్యాలయంలో శనివారం ‘జీవన నైపుణ్యాల మెరుగులో నైతిక విలువల పాత్ర’ అనే అంశంపై కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల విద్యలో పిల్లల ఆలోచనా విధానం, సత్ప్రవర్తనతో ఉంటే మరింతగా జీవన నైపుణ్యాలు అలవడతాయన్నారు. అనంతరం ఇటీవల రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుమతులు గెలుచుకున్న విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో తేజ అకడమిక్‌ సలహాదారు పోతుగంటి నాగేశ్వరరావు, వైస్‌ప్రిన్సిపాల్‌ మంత్రిప్రగడ వేణుగోపాలరావులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 12:00 AM