సొమ్ములిచ్చి సహకరించండి!

ABN , First Publish Date - 2023-06-02T02:39:32+05:30 IST

‘గతంలో మీరు అందించిన సహకారం మా దృష్టిలో ఉంది. కానీ ఈ మధ్య మా వాళ్లు వచ్చినప్పుడు సరిగ్గా స్పందించడం లేదు.

సొమ్ములిచ్చి సహకరించండి!

ఖమ్మంలోని వ్యాపారులకు మావోయిస్టుల పేరిట లేఖలు?

ఖమ్మం, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ‘గతంలో మీరు అందించిన సహకారం మా దృష్టిలో ఉంది. కానీ ఈ మధ్య మా వాళ్లు వచ్చినప్పుడు సరిగ్గా స్పందించడం లేదు. ప్రస్తుతం మాకు సహకారం అందించండి. లేదంటే మా కొరియర్‌ ద్వారా మా దగ్గరకు రావాల్సి ఉంటుంది’ అంటూ ఖమ్మం నగరంలోని కొందరు వ్యాపారులకు మావోయిస్టుల పేరిట లేఖలు రావడం చర్చనీయాంశమైంది. ఓ మార్కిస్టు పార్టీకి చెందిన ఖమ్మం- వరంగల్‌ ఏరియా కమిటీ పేరుతో నగదు ఇవ్వాలంటూ ఖమ్మంలోని కొందరు వ్యాపారులకు కొరియర్ల ద్వారా లేఖలు అందినట్టు సమాచారం. మిగిలిన వ్యాపారుల నుంచి నగదు వసూలు చేసి ఇవ్వాలంటూ కొందరికి హుకుం జారీ చేశారని తెలిసింది. దీంతో కొందరు తమ తోటి వ్యాపారుల నుంచి నగదు వసూలు చేసినట్టు కూడా సమాచారం. ఇది తెలిసి వ్యాపారవర్గాలు భయపడుతున్నాయి.

Updated Date - 2023-06-02T02:39:32+05:30 IST