బీజేపీ నేతలను తండాల్లో తిరగనివ్వం
ABN , First Publish Date - 2023-08-02T00:18:07+05:30 IST
రాజకీయ లబ్ధి కోసం గిరిజన కులాల మధ్య చిచ్చుపెడుతున్న బీజేపీ నేతలను గిరిజన తండాల్లో తిరగనివ్వమని కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేశారు.
షాద్‌నగర్/కేశంపేట, ఆగస్టు 1 : రాజకీయ లబ్ధి కోసం గిరిజన కులాల మధ్య చిచ్చుపెడుతున్న బీజేపీ నేతలను గిరిజన తండాల్లో తిరగనివ్వమని కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేశారు. మంగళవారం షాద్‌నగర్ పట్టణంలోని వీ కన్వెన్షన్ హాల్లో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఎంపీ సోయం బాపురావు గిరిజనులకు రిజర్వేషన్లు ఎత్తివేయాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాయడంపై మండిపడ్డారు. ఎన్నికల ముసుగులో ఆ పార్టీ నేతలు కులాలు, మతాల మధ్య అల్లర్లు సృష్టించి ఓట్ల రాజకీయం చేయడానికి కుట్ర పన్నారని విమర్శించారు. సాక్షాత్తు ఒక గిరిజనుడైన ఆ పార్టీ ఎంపీ రిజర్వేషన్లను రద్దు చేయాలని కోరడంలో అమిత్ షా హస్తం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ గిరిజనులకు రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ లేఖ రాస్తే కేసీఆర్ కూడా స్పందించలేదని, దీంతో ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం ఏంటో తేటతెల్లమయిందని వీర్లపల్లి విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ గిరిజనులకు అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్‌ను గద్దె దించడం ఖాయం
బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని, అందుకోసం ప్రజలు ఎదురు చూస్తున్నరని వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళవారం కేశంపేట మండలంలోని తొమ్మిదిరేకుల, లింగంధన గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో ప్రతీ ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారని, గ్యాస్ సిలిండర్ ధర రూ.1200లకు చేరుకుందని, నిత్వావసర సరుకుల ధరలు పెరిగితున్నాయని, ప్రభుత్వం ధరలను అదుపు చేయడంలో విఫలమైందన్నారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడారు. అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేసినా, బెదిరింపులకు పాల్పడినా బెదరకుండా ముందుకు సాగాలని దిశానిర్ధేశం చేశారు. కార్యక్రమాల్లో మండలాధ్యక్షుడు వీరేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వర్ప, ఎస్సీ, బీసీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ, రైతు సెల్, మహిళా, రైతు అధ్యక్షులు నాగిళ్ల భాస్కర్, రావుల పెంటయ్య, రూప్లానాయక్, ఇబ్రహీం, రాములు, అనసూయ, యెన్నం శ్రీధర్ రెడ్డి, రాంరెడ్డి, రాజేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రమేష్, ఆంజనేయులు, పర్వతాలు, కరుణాకర్ రెడ్డి, చంద్రయ్య, రాఘవేందర్, ప్రకాశ్‌గౌడ్, నర్సింహులు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.