Share News

Farmhouse: ఫామ్‌హౌస్‌కు పోదాం..చలో చలో!

ABN , Publish Date - Dec 31 , 2023 | 03:20 AM

న్యూ ఇయర్‌ కోసం మస్త్‌ మస్త్‌ పార్టీ చేసుకునేందుకు హోటళ్లు, క్లబ్బులు ఇప్పుడు కాస్త ఓల్డ్‌ ట్రెండే! ఫామ్‌ హౌస్‌లు, రిసార్ట్‌లే నయా ట్రెండ్‌! నగరానికి దూరంగా మద్యం మజాలో డీజేల హోరు.

Farmhouse: ఫామ్‌హౌస్‌కు పోదాం..చలో చలో!

న్యూ ఇయర్‌ కోసం నగర శివార్లకు పార్టీ ప్రియులు

రూ.20 వేల నుంచి రూ.1.5 లక్షల దాకా కిరాయి

డీజే, మద్యం, భోజనానికి సప‘రేటు’

కుటుంబసభ్యులతోనూ వెళ్లేందుకు ప్రాధాన్యం

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 30, (ఆంధ్రజ్యోతి): న్యూ ఇయర్‌ కోసం మస్త్‌ మస్త్‌ పార్టీ చేసుకునేందుకు హోటళ్లు, క్లబ్బులు ఇప్పుడు కాస్త ఓల్డ్‌ ట్రెండే! ఫామ్‌ హౌస్‌లు, రిసార్ట్‌లే నయా ట్రెండ్‌! నగరానికి దూరంగా మద్యం మజాలో డీజేల హోరు.. డ్యాన్సులు, కేకల మధ్య ఆనందంపుటంచులను తాకితే అదే అసలైన పార్టీ అని.. అడిగేవారు, అడ్డు చెప్పేవారూ ఉండరనే భావనతో పార్టీ ప్రియులు ఫామ్‌హౌ్‌సలకు వెళ్లేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. నలుగురు నుంచి పదిమంది దాకా పోగై కొందరు.. కుటుంబసభ్యులతో ఇంకొందరు ఫామ్‌హౌ్‌సలకు వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఇందుకు నగర శివార్లలో ఉన్నవాటిని బుక్‌ చేసుకుంటున్నారు. న్యూ ఇయర్‌ వేడుకల కోసం మొయినాబాద్‌, చిలుకూరు బాలాజీ రోడ్‌, జల్‌పల్లి, చేవెళ్ల, శంషాబాద్‌, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, వికారాబాద్‌, గండిపేట తదితర ప్రాంతాల్లోని ఫామ్‌హౌ్‌సలకు డిమాండ్‌ పెరిగిపోయింది. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో గతంతో పోలిస్తే 20-30ు అధిక రేట్లను నిర్వాహకులు వసూలు చేస్తున్నట్లు వినికిడి. ‘డిసెంబరు 31 రాత్రి’ కోసం కనీసం రూ.20 వేల నుంచి రూ.1.50 లక్షల దాకా వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇది కిరాయి మాత్రమే. డీజేకు, మద్యానికి, ఫుడ్డుకు అదనంగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మందు, ఫుడ్డు ఏదైనా కోరుకున్న వెరైటీకి అనుగుణంగా ధరలు చెల్లించాల్సి ఉంటుంది. అయినా సరే ఈ ఖర్చును పార్టీ ప్రియులు అస్సలు పట్టించుకోవడం లేదు. న్యూ ఇయర్‌ మజా కోసం ఎంతైనా చెల్లించేందుకు రెడీ అయిపోయారు. ఫ్యామిలీలు కూడా ఫామ్‌హౌస్‌లకు చేరుతున్నాయి. నాలుగైదు కుటుంబాలు కలిసి వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు.

తనిఖీలకు దూరంగా... సంతోషానికి దగ్గరగా!

సాధారణంగా న్యూ ఇయర్‌ పార్టీలు అనగానే పోలీసుల ఆంక్షలుంటాయి. ఆ రోజు రాత్రంతా తనిఖీలుంటాయి. ఈ తలనొప్పులెందుకని చాలా మంది ఏ గోవాకో.. దుబాయ్‌కో వెళ్లి సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడీ ధోరణి మారుతోంది. ఇప్పటికే కిట్టీ పార్టీలంటూ వీకెండ్స్‌లో ఫామ్‌ హౌస్‌లకు వెళ్లి మజా చేస్తున్న పార్టీ ప్రియులు.. న్యూ ఇయర్‌ వేడుకలకూ అవే బెటర్‌ అంటున్నారు. ఫలితంగా శివార్లలోని ఫామ్‌హౌ్‌సలు, రిసార్ట్‌లు దాదాపుగా ఫుల్‌ అయిపోయాయి. తమ ఫామ్‌హౌస్‌ ఇప్పటికే బుక్‌ అయిందని మొయినాబాద్‌లో ఓ యజమాని మీర్జా చెప్పారు. ప్రైవసీతో పాటుగా పోలీసు బాధలు కూడా ఉండవని.. యూత్‌ అంతా ఫామ్‌హౌ్‌సలకే వస్తున్నారని ఆయన చెప్పారు. అయితే ఫామ్‌హౌస్‌లపై పోలీసు నిఘా ఉంటుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఫామ్‌హౌస్‌లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, డీజే సౌండ్‌లతో ఇబ్బంది కలిగిస్తున్నారంటూ చుట్టుపక్కల వారి ఫిర్యాదులతో పోలీసులు గట్టిగానే నిఘా పెడుతున్నారు.

ఫామ్‌హౌ్‌సలో ఏముంటాయి?

నగరం నలువైపులా ఫామ్‌హౌస్‌లు ఉన్నాయిప్పుడు. విల్లాల తరహాలో ఉన్న ఈ ఫామ్‌హౌస్‌లలో మూడు లేదా నాలుగు బెడ్‌రూమ్‌లు, పార్టీ హాల్‌, ఔట్‌డోర్‌ లాన్‌, స్విమ్మింగ్‌పూల్‌, ఫుల్‌ టైమ్‌ కేర్‌ టేకర్స్‌, సహాయకులు, మ్యూజిక్‌ సిస్టమ్‌, ఫుడ్‌ ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంటున్నాయి.

Updated Date - Dec 31 , 2023 | 07:24 AM