Share News

చెన్నూరులో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ లొల్లి

ABN , First Publish Date - 2023-11-10T04:07:41+05:30 IST

మంచిర్యాల జిల్లా చెన్నూరులోని నామినేషన్‌ కేంద్రం వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్‌ వేసేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థి వివేక్‌ తన అనుచరులతో రాగా..

చెన్నూరులో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ లొల్లి

నామినేషన్‌ కేంద్రానికి కిలోమీటరు దూరంలో

వివేక్‌ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

బాల్క సుమన్‌ను అనుమతించడంతో గొడవ

చెన్నూరు, నవంబరు 9 : మంచిర్యాల జిల్లా చెన్నూరులోని నామినేషన్‌ కేంద్రం వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్‌ వేసేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థి వివేక్‌ తన అనుచరులతో రాగా.. తహసీల్దార్‌ కార్యాలయానికి కి.మీ. దూరంలో ఆయన వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు. దీంతో వివేక్‌ వాహనం దిగి ఐదుగురితో కలిసి కాలినడకన బయలుదేరారు. ఆ వెనకే వచ్చిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాల్క సుమన్‌ వాహనాన్ని నామినేషన్‌ కేంద్రానికి వంద మీటర్ల దూరం వరకు అనుమతించారు. దీంతో కాంగ్రెస్‌ శ్రేణులు నామినేషన్‌ కేంద్రం వైపు పరుగులు తీసి పోలీసులను ప్రశ్నించాయి. అధికార పార్టీ అభ్యర్థికి ఎలా అనుమతి ఇస్తారని నిలదీశాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కాగా, పోలీసుల తీరుపై రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశానని, ఈసీకి ఫిర్యాదు చేస్తానని వివేక్‌ తెలిపారు.

Updated Date - 2023-11-10T04:07:43+05:30 IST