Share News

రైతుబంధుపై కేసీఆర్‌వి పచ్చి అబద్ధాలు : ఉత్తమ్‌

ABN , First Publish Date - 2023-11-10T04:46:51+05:30 IST

రైతుబంధు, ఉచిత విద్యుత్‌పై సీఎం కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.

రైతుబంధుపై కేసీఆర్‌వి పచ్చి అబద్ధాలు : ఉత్తమ్‌

హుజూర్‌నగర్‌, నవంబరు 9: రైతుబంధు, ఉచిత విద్యుత్‌పై సీఎం కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రె్‌సదేనన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ 80స్థానాల్లో గెలుస్తుందని జోస్యం చెప్పారు. హుజూర్‌నగర్‌, కోదాడలో శుక్రవారం నిర్వహించే రోడ్‌షోలో డీకే శివకుమార్‌ పాల్గొంటారని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. హుజూర్‌నగర్‌లో మెజారిటీ 50వేలకు ఒక్క ఓటు తగ్గినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు.

Updated Date - 2023-11-10T04:46:52+05:30 IST