‘కేసీఆర్ ఇప్పటికైనా పద్ధతిని మార్చుకోవాలి’
ABN , First Publish Date - 2023-06-26T03:52:43+05:30 IST
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్ సామూహికంగా ప్రజలను కలవనక్కర్లేదని(ప్రజా దర్బార్), ప్రభుత్వ యంత్రాంగం...
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్ సామూహికంగా ప్రజలను కలవనక్కర్లేదని(ప్రజా దర్బార్), ప్రభుత్వ యంత్రాంగం పనిచేయకపోతేనే సీఎంను కలవాలని మంత్రి కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ, సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. విజ్ఞప్తులకు, ఉత్తరాలకు సైతం జవాబులు ఇవ్వకుండా ఉండటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఇప్పటికే ఆలస్యమైందని, సీఎం కేసీఆర్ ఇప్పటికైనా తన పద్ధతిని సవరించుకునే ప్రయత్నం చేయాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు.