నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్
ABN , First Publish Date - 2023-08-22T04:37:03+05:30 IST
ఉద్యోగ నియామకాలంటూ సీఎం కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి ప్రకాశ్ జావడేకర్ ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి జావడేకర్
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ నియామకాలంటూ సీఎం కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి ప్రకాశ్ జావడేకర్ ఆరోపించారు. ఆయన కుటుంబంలో మాత్రం కేటీఆర్, హరీష్, కవిత, సంతో్‌షలకు ఉద్యోగాలు దక్కాయని విమర్శించారు. నీళ్లు, నిధు లు, నియామకాలపై హామీ ఇచ్చిన కేసీఆర్.. అవినీతి, మోసం, కుటుంబ పాలన ఇచ్చారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18 లక్షల ఎకరాలకు నీరందిస్తామని ప్రకటించారు.. కానీ లక్ష ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇచ్చారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 40 వేల కోట్లు కాగా లక్షా 20వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు.. అయినా అసంపూర్తిగానే మిగిలిపోయిందన్నారు. అవినీతికి, రాష్ట్ర ప్రజలను మోసం చేశారనడానికి ఈ ప్రాజెక్టే ఉదాహరణ అని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రకాశ్ జావడేకర్ మీడియా సమావేశంలో సోమవారం మాట్లాడారు. బీజేపీలో చేరేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారని అంటూ ఎంతమంది చేరుతారో ఈ నెల 27న అందరూ చూస్తారని చెప్పారు.