కర్ణాటక సాహిత్య మందిర పునర్నిర్మాణానికి రూ.5 కోట్లు
ABN , First Publish Date - 2023-03-04T03:57:09+05:30 IST
హైదరాబాద్, కాచిగూడలోని కర్ణాటక సాహిత్య మందిర పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందుకోసం సీఎం కేసీఆర్ రూ.5 ..
కర్ణాటక సాహిత్య మందిర పునర్నిర్మాణానికి రూ.5 కోట్లు
హైదరాబాద్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్, కాచిగూడలోని కర్ణాటక సాహిత్య మందిర పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందుకోసం సీఎం కేసీఆర్ రూ.5 కోట్లు నిధులను కూడా మంజూరు చేశారు. ఈ మేరకు ప్రగతి భవన్‌లో శుక్రవారం తనను కలిసిన అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, పలువురు కర్ణాటక వాసులు చేసిన విజ్ఞప్తి మేరకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల ప్రజల సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలను తెలంగాణ ప్రభుత్వం గౌరవిస్తుందని ఈ సందర్భంగా కేసీఆర్ వెల్లడించారు. కర్ణాటక సాహిత్య మందిర పునర్నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యేను అధికారులను ఆదేశించారు.