‘కంటివెలుగు’ దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2023-01-25T00:55:27+05:30 IST

సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన కంటివెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. మంగళవారం నాగారం గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న కంటివెలుగు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. పేద ప్రజల అభివృద్ధికోసం సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. దేశానికే ఆదర్శంగా రాష్ట్ర పథకాలు నిలుస్తున్నాయని, దేశ ప్రజలు సీఎం కేసీఆర్‌ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు.

‘కంటివెలుగు’ దేశానికే ఆదర్శం

విద్యుత్‌ శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి

అర్వపల్లి, జనవరి 24: సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన కంటివెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. మంగళవారం నాగారం గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న కంటివెలుగు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. పేద ప్రజల అభివృద్ధికోసం సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. దేశానికే ఆదర్శంగా రాష్ట్ర పథకాలు నిలుస్తున్నాయని, దేశ ప్రజలు సీఎం కేసీఆర్‌ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజలు కంటి వెలుగు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కూరం మణివెంకన్న, డిప్యూటీ డీఎంహెచ్‌వో హర్షవర్థన్‌, తహసీల్ధార్‌ హరిచంద్రప్రసాద్‌, ఎంపీడీవో శోభరాణి, డాక్టర్‌ హర్షవర్థన్‌, గుండగాని అంబయ్య, దోమల బాలమల్లు, సోమయ్య, బద్రి, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలి : కలెక్టర్‌

నూతనకల్‌: ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటివెలుగు పథకంలో భాగంగా గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి పరీక్షలు ప్రతిఒక్కరూ చేయించుకోవాలని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ అన్నారు. మంగళవారం నూతనకల్‌ మండల పరిధిలోని మిర్యాల గ్రామంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించారు. కలెక్టర్‌వెంట తహసీల్దార్‌ జమీరుద్దీన్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కనకటి వెంకన్న, సర్పంచ్‌ కనకటి సునీత, ఎంపీడీవో ఇందిర, తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-01-25T00:55:27+05:30 IST