తెలంగాణ ఎన్నికల బరిలో జనసేన
ABN , First Publish Date - 2023-10-03T03:53:31+05:30 IST
‘తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడమే జనసేన లక్ష్యం’ నినాదంతో తెలంగాణలో పోటీకి జనసేన సిద్ధమైంది.
హైదరాబాద్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడమే జనసేన లక్ష్యం’ నినాదంతో తెలంగాణలో పోటీకి జనసేన సిద్ధమైంది. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అనువైన నియోజకవర్గాల్ని ఎంచుకున్న ఆ పార్టీ 32 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. పార్టీ పోటీ చేయనున్న 32 నియోజకవర్గాల జాబితాను సోషల్ మీడియా వేదికగా సోమవారం విడుదల చేసింది. కాగా, పవన్ కల్యాణ్ వారాహి యాత్ర తెలంగాణాలో కూడా ఉంటుందని జనసేన రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్‌గౌడ్ తెలిపారు.