జగదీశరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న నలుగురు రైతుల అరెస్టు

ABN , First Publish Date - 2023-06-01T02:55:04+05:30 IST

రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) అలైనమెంట్‌ను మార్చాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట మంత్రి జగదీశరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న నలుగురు రైతులు, ఇద్దరు రాజకీయ నేతలపై కేసులు నమోదయ్యాయి.

జగదీశరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న   నలుగురు రైతుల అరెస్టు

యాదాద్రి, మే 31 (ఆంధ్రజ్యోతి): రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) అలైనమెంట్‌ను మార్చాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట మంత్రి జగదీశరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న నలుగురు రైతులు, ఇద్దరు రాజకీయ నేతలపై కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైన రైతుల్లో భువనగిరి మండలం రాయిగిరికి చెందిన గడ్డమీది మల్లేశ, పల్లెర్ల యాదగిరి, అవుశెట్టి నిఖిల్‌, మల్లెబోయిన బాలనర్సింహతోపాటు బీజేపీ రాష్ట్ర నేత గూడూరు నారాయణరెడ్డి, టీపీసీసీ సభ్యుడు తంగెళ్లపల్లి రవికుమార్‌ ఉన్నారు. నలుగురు రైతులను మంగళవారం అర్ధరాత్రి భువనగిరి సబ్‌జైలుకు తరలించగా, గూడూరు నారాయణరెడ్డి, తంగెళ్లపల్లి రవికుమార్‌ పరారీలో ఉన్నట్లు భువనగిరి రూరల్‌ ఎస్‌ఐ దిలీ్‌పకుమార్‌ తెలిపారు. రైతులను అరెస్టు చేయడాన్ని డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి ఖండించారు. భువనగిరి సబ్‌జైలులో ఉన్న రైతులను, జైలు బయట ఉన్న వారి కుటుంబసభ్యులను ఆయన బుధవారం పరామర్శించారు. రైతులకోసం ఎక్కడికైనా వస్తానన్న భువనగిరి ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి.. రైతులను జైలుకు పంపేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు.

Updated Date - 2023-06-01T02:55:04+05:30 IST