Share News

Kumaram Bheem Asifabad: మార్లవాయిని సందర్శించిన ఐటీడీఏ పీవో

ABN , Publish Date - Dec 26 , 2023 | 10:10 PM

మండలంలోని మార్లవాయి గ్రామాన్ని ఐటీడీఏ పీవో చాహత్‌ బాజ్‌పాయ్‌ మంగళవారం సందర్శించారు

Kumaram Bheem Asifabad: మార్లవాయిని సందర్శించిన ఐటీడీఏ పీవో
మార్లవాయిలో సమస్యలు తెలుసుకుంటున్న ఐటీడీఎ పీవో చాహత్‌ బాజ్‌పాయ్‌

జైనూర్‌, డిసెంబరు 26: మండలంలోని మార్లవాయి గ్రామాన్ని ఐటీడీఏ పీవో చాహత్‌ బాజ్‌పాయ్‌ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మానవ పరిణామ శాస్త్రవేత ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్‌, ఆయన సతీమణి వర్ధంతిని జనవరి 11న నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఐటీడీఏ తరపున సహకరిస్తామని అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను సర్పంచ్‌ కనక ప్రతిభ పీవో దృష్టికి తీసుకెళ్లారు. అంతకు ముందు గ్రామస్థులు పీవోను సన్మానించారు. కార్యక్రమంలో డార్ఫ్‌ యువజన సంఘం అధ్యక్షులు కనక వెంకటేష్‌, సార్మేడి జుగనాక దేవరావ్‌, సభ్యులు జుగునాక ధర్మేందర్‌, గణపత్‌, మాజీ సర్పంచ్‌ కనక కొద్దు, ఉప స లింగు, ర్పంచ్‌ జుగునాక సావిత్రిబాయి, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 10:10 PM