కేసీఆర్‌తోనే కుల వృత్తులకు పూర్వవైభవం

ABN , First Publish Date - 2023-03-06T01:06:40+05:30 IST

సీఎం కేసీఆర్‌తేనే దేశంలో కులవృత్తులకు పూర్వవైభవం సాధ్యమని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. ఆధునిక దోభీ ఘాట్ల నిర్మాణంపై ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ సామాజిక దృక్పథం కలిగిన దార్శనికుడన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వారిని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నా రు.

కేసీఆర్‌తోనే కుల వృత్తులకు పూర్వవైభవం

ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి

నల్లగొండ, మార్చి 5: సీఎం కేసీఆర్‌తేనే దేశంలో కులవృత్తులకు పూర్వవైభవం సాధ్యమని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. ఆధునిక దోభీ ఘాట్ల నిర్మాణంపై ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ సామాజిక దృక్పథం కలిగిన దార్శనికుడన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వారిని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నా రు. రజక, నాయీ బ్రాహ్మణులకు నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.282కోట్లతో 141 మునిసిపాలిటీల్లో ఆధునిక దోభీ ఘాట్ల నిర్మాణం చేపట్టారన్నారు. నియోజకవర్గంలో రజకుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఎంబీసీ జాతీయ కన్వీనర్‌ రజక సంఘాల సమితి రాష్ట్ర చీఫ్‌ అడ్వైజర్‌ కొండూరు సత్యనారాయణ మాట్లాడుతూ, రజక భవన నిర్మాణానికి శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి రూ.10లక్షలు, రాజ్యసభ సభ్యు డు బి.లింగయ్య యాదవ్‌ రూ.10లక్షలు, శాసన మండలి సభ్యులు బసవరాజు సారయ్య రూ.10లక్షలు నిధులు ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీడీపీ నిధులు రూ.10లక్షలతో రజక భవన పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, కౌన్సిలర్‌ అభిమన్యు శ్రీనివాస్‌, ఆమంచి అంజయ్య, చిలకరాజు చెన్నయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బెంగళూరు తరహాలో ఆధునిక దోభీ ఘాట్లను మంజూరు చేసినందుకు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ కాబో యే సీఎం కేటీఆర్‌ అంటూ ప్లెక్సీ ఏర్పాటుచేసి క్షీరాభిషేకం చేశారు.

Updated Date - 2023-03-06T01:06:40+05:30 IST