GANDHI HOSPITAL : గాంధీ ఆస్పత్రికి ఐఎస్‌వో గుర్తింపు

ABN , First Publish Date - 2023-08-21T04:57:12+05:30 IST

కొవిడ్‌ సమయంలో విశిష్ట సేవలందించిన గాంధీ ఆస్పత్రికి ఐఎ్‌సవో గుర్తింపు దక్కింది.

GANDHI HOSPITAL : గాంధీ ఆస్పత్రికి ఐఎస్‌వో గుర్తింపు

కొవిడ్‌ వేళ విశిష్ట సేవలందించినందుకే..

సూపరింటెండెంట్‌కు హరీశ్‌ అభినందనలు

అడ్డగుట్ట, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ సమయంలో విశిష్ట సేవలందించిన గాంధీ ఆస్పత్రికి ఐఎ్‌సవో గుర్తింపు దక్కింది. క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ హెల్త్‌ అండ్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌లో ఐఎ్‌సవో సర్టిఫికెట్‌ లభించింది. ఈ మేరకు ఆ స్పత్రిలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సంబంధిత సర్టిఫికెట్‌ను ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు, గైనిక్‌ విభాగాధిపతి సంగీతకు మంత్రి హరీశ్‌రావు అందజేశారు. ఈ సందర్భంగా రాజారావును ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో నూతనంగా నిర్మించిన మాతా శిశు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ.. మాతా శిశు మరణాల తగ్గింపులో గాంధీ వైద్యుల పాత్ర ప్రశంసనీయమన్నారు. రూ.52 కోట్ల తో నిర్మించిన రెండు వందల పడకల సూపర్‌ స్పెషాలిటీ ఎంసీహెచ్‌ భవనం ద్వారా మరింత మందికి సేవలు అందించే వీలుంటుందని పేర్కొన్నారు. వివిధ రకాల సమస్యలతో బాధపడే శిశువులకు మాతా శిశు కేంద్రంలో కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం అందుతుందని చెప్పారు. కాగా, నవజాత శిశులను అత్యవసర సమయంలో ఆస్పత్రులకు చేర్చే విధంగా జిల్లాకు ఒకటి చొప్పున 33 నియోనాటల్‌ అంబులెన్స్‌లను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.

108, 104, 102కు ఒకటే కాల్‌ సెంటర్‌

యూసు్‌ఫగూడ: ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా పని చేస్తు న్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వెంగళరావుగనర్‌లోని ఇండియన్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్‌ఫేర్‌ (ఐఐహెచ్‌ఎ్‌ఫడబ్ల్యూ) కార్యాలయంలో ఆదివారం 108, 104, 102 ఎమర్జెన్సీ నంబర్లకు సంబంధించిన కేంద్రీ కృత కాల్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఇప్పటిదాకా 102, 104, 108 హెల్ప్‌లైన్‌లు వేర్వేరుగా ఉన్నాయని, ఇకనుంచి అన్ని సేవలు ఒకే స్థానం నుంచి నిర్వహించేందుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ను ప్రారంభించామన్నారు. ఇందులో 24గంటలు వివిధ షిఫ్ట్‌ల లో 110 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తూ నిరంతరంగా సేవలందిస్తారని చెప్పారు. 108 ద్వారా తక్షణ వైద్యసాయం, 102 ద్వారా అమ్మఒడి సేవలు, 104ద్వారా వైద్య సమాచారం, సలహాలు, సూచనలు ప్రజలకు అందుతాయన్నారు.

Updated Date - 2023-08-21T04:57:12+05:30 IST