హౖదరాబాద్‌లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు
ABN , Publish Date - Dec 31 , 2023 | 04:14 AM
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు-2024కు జేఎన్‌టీయూ వేదిక కానుంది. ఈ విషయాన్ని వీసీ కట్టా నరసింహారెడ్డి, రెక్టార్ గోవర్ధన్ శనివారం ఇంజనీరింగ్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకల్లో వెల్లడించారు.
ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు నిర్వహణ
హాజరుకానున్న ప్రధాని మోదీ
జేఎన్‌టీయూ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు-2024కు జేఎన్‌టీయూ వేదిక కానుంది. ఈ విషయాన్ని వీసీ కట్టా నరసింహారెడ్డి, రెక్టార్ గోవర్ధన్ శనివారం ఇంజనీరింగ్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకల్లో వెల్లడించారు. ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు నిర్వహించనున్న సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరవుతారని తెలిపారు. సదస్సుకు దేశ, విదేశాల నుంచి దాదాపు 10 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని, పలువురు నోబెల్ గ్రహీతలను కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ప్రధాన మంత్రి హాజరైతే యూనివర్సిటీ అభివృద్ధికి మరిన్ని అడుగులు పడతాయని, ఎన్‌ఐటీ, ఐఐటీలకు ఏమాత్రం తీసిపోకుండా మౌలిక సదుపాయాల కల్పనకు పునాదులు పడతాయని వీసీ ఆశాభావం వ్యక్తం చేశారు.