ఇండియన్ మహిళకే మిసెస్ గ్లామ్ వరల్డ్ -2023 కిరీటం
ABN , First Publish Date - 2023-06-26T23:59:43+05:30 IST
మణప్పురం, ఎస్‌ఏజీ మిసెస్ గ్లామ్ వరల్డ్ 2023 పోటీలో విజేతగా ఇండియాకు చెందిన మహిళ పూజ మోహన్ నిలిచింది. కొచ్చిలో మిసెస్ గ్లామ్ వరల్డ్ -2023 గ్రాండ్ ఫినాలే
మణప్పురం, ఎస్‌ఏజీ మిసెస్ గ్లామ్ వరల్డ్ 2023 పోటీలో విజేతగా ఇండియాకు చెందిన మహిళ పూజ మోహన్ నిలిచింది. కొచ్చిలో మిసెస్ గ్లామ్ వరల్డ్ -2023 గ్రాండ్ ఫినాలే పోటీలు కన్నులపండువగా జరిగాయి. దేశవిదేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొన్న ఈ పోటీల్లో ఇండియాకి చెందిన పూజ మోహన్ విజేతగా నిలవగా.. మొదటి రన్నరప్‌గా రష్యాకు చెందిన బొచ్చారోవ దార్య, రెండో రన్నరప్‌గా మలేషియాకి చెందిన నిరనీశ్వరీ పరమశివం గెలుపొందారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఏజీ గ్రూప్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ సిఎమ్‌డి సాజన్ వర్గీస్ మరియు పెగాసస్ చైర్మన్ డాక్టర్ అజిత్ రవి ఈ పోటీల వివరాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద సంఖ్యలో యువతులు దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుపుతూ.. ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు బంగారు కిరీటాలను అందజేశారు.