పీజీ వైద్య విద్యార్థులకు స్టైపెండ్‌ పెంపు

ABN , First Publish Date - 2023-05-28T04:03:18+05:30 IST

పీజీ వైద్య విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ ప్రకటించింది. వారి స్టైపెండ్‌ను 15 శాతం పెంచింది. ఈ ఏడాది

పీజీ వైద్య విద్యార్థులకు స్టైపెండ్‌ పెంపు

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): పీజీ వైద్య విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ ప్రకటించింది. వారి స్టైపెండ్‌ను 15 శాతం పెంచింది. ఈ ఏడాది జనవరి నుంచే ఇది వర్తించనుంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ శనివారం జీవో జారీ చేశారు. హౌజ్‌సర్జన్స్‌ మెడికల్‌, డెంటల్‌తో పాటు పీజీ డిగ్రీ, డిప్లొమా, సూపర్‌ స్పెషాలిటీ వైద్య విద్యార్థులకు స్టైపెండ్‌ పెంపు వర్తిస్తుందని అందులో పేర్కొంది. ప్రస్తుతం ఎంబీబీఎస్‌ పూర్తి చేసి వివిధ బోధనాస్పత్రుల్లో హౌజ్‌సర్జన్‌, డెంటల్‌ హౌజ్‌సర్జన్లుగా పనిచేస్తున్న వారికి గౌరవ వేతనంగా నెలకు రూ.22,527 ఇస్తుండగా, దాన్ని రూ.25,906కు పెంచారు. తమకు గౌరవ వేతనం పెంచడంపై తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-05-28T04:03:18+05:30 IST