Bharat Gaurav: తెలుగు రాష్ట్రాల్లో ’భారత్ గౌరవ్’ తొలి పరుగు నేడే
ABN , First Publish Date - 2023-03-18T03:18:55+05:30 IST
దేశ సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పేందుకు భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ పేరిట భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన పర్యాటక రైలు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి పరుగు పెట్టేందుకు సిద్ధమైంది.

న్యూఢిల్లీ, మార్చి 17 : దేశ సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పేందుకు భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ పేరిట భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన పర్యాటక రైలు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి పరుగు పెట్టేందుకు సిద్ధమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ స్టేషన్ల మీదుగా పూరీ- కాశీ- అయోధ్య పుణ్యక్షేత్రయాత్రకు వెళ్లే భారత్ గౌరవ్ రైలు ప్రయాణం శనివారం సికింద్రాబాద్ నుంచి ప్రారంభం కానుంది. ఎనిమిది రాత్రులు, తొమ్మిది రోజులు సాగే ఈ యాత్రలో ప్రయాణికులు పూరీ, కోణార్క్, గయ, వారాణసీ, అయోఽధ్య, ప్రయాగ్‌రాజ్ ప్రాంతాలను సందర్శించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది స్టేషన్లలో ఆగే ఈ రైల్లో సీట్లన్నీ బుక్ అయ్యాయని ఐఆర్‌సీటీసీ తెలిపింది.