ఊపిరి ఉన్నంతవరకూ బీజేపీలోనే: డీకే అరుణ
ABN , First Publish Date - 2023-11-06T03:54:56+05:30 IST
ఊపిరి ఉన్నంత వరకూ తాను బీజేపీలోనే కొనసాగుతానని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు.
హైదరాబాద్, గద్వాల, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఊపిరి ఉన్నంత వరకూ తాను బీజేపీలోనే కొనసాగుతానని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని పత్రికలు, ఛానెళ్లు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయని, బీజేపీ నుంచి వలసలు ప్రోత్సహించాలని కాంగ్రెస్ నేతలు కొన్ని ప్రసార మాధ్యమాలకు బాధ్యతలు అప్పగించినట్లు అనుమానం కలుగుతోందని అన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే న్యాయ విచారణకు సిద్ధంగా ఉండాలని ఆమె ఒక ప్రకటనలో హెచ్చరించారు. కాగా, డీకే అరుణకు బీజేపీ జాతీయ నాయకత్వం హెలికాప్టర్ కేటాయించింది. నేటి నుంచి ఆమె పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆయా నియోజకవర్గాలకు హెలికాప్టర్‌లో వెళ్లి ప్రచారం చేయనున్నారు.