కాంగ్రెస్ హామీల అమలు పక్కా
ABN , First Publish Date - 2023-09-22T03:08:33+05:30 IST
కాంగ్రెస్ అంటే నమ్మకమని, పార్టీ హామీ ఇచ్చిందంటే అమలు చేసి తీరుతుందని మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు,
మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నాల, చిన్నారెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అంటే నమ్మకమని, పార్టీ హామీ ఇచ్చిందంటే అమలు చేసి తీరుతుందని మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, చిన్నారెడ్డి స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో గురువారం జరిగిన మేనిఫెస్టో కమిటీ సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో పర్యటిస్తామని.. అక్కడి ప్రత్యేక అంశాలతో స్థానిక మేనిఫెస్టోలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 13,500 టీచర్ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ పెట్టాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. ప్రజలపై సీఎం కేసీఆర్ రూ.50 వేల కోట్ల కరెంటు భారం మోపారని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు.