Share News

నేను ఎక్కడికి వెళ్లడం లేదు

ABN , Publish Date - Dec 14 , 2023 | 04:05 AM

తాను ఎక్కడికి వెళ్లడం లేదని, తెలంగాణ కేడర్‌లోనే ఉంటానంటూ సీనియర్‌ ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌ స్పష్టతనిచ్చారు. కేంద్ర సర్వీసులకు వెళ్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆమె ఖండించారు.

నేను ఎక్కడికి వెళ్లడం లేదు

తెలంగాణ కేడర్‌లోనే ఉంటా..: స్మితాసబర్వాల్‌

హైదరాబాద్‌, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తాను ఎక్కడికి వెళ్లడం లేదని, తెలంగాణ కేడర్‌లోనే ఉంటానంటూ సీనియర్‌ ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌ స్పష్టతనిచ్చారు. కేంద్ర సర్వీసులకు వెళ్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. గత ప్రభుత్వంలో ఆమె సీఎంవో కార్యదర్శిగా, ప్రస్తుతం నీటిపారుదల శాఖ ఇన్‌చార్జి ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అయితే ఆమె ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలవకపోవడం, నీటిపారుదల శాఖ సమీక్షలకు హాజరు కాకపోవడం చర్చకు దారితీసింది. ఇదే సమయంలో కేంద్ర సర్వీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని, ఈ మేరకు రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్‌ చేయాలని సీఎ్‌సకు దరఖాస్తు పెట్టుకున్నారని గుసగుసలు కూడా వినిపించాయి. దీనిపై ఆమె తాజాగా స్పందించారు. ‘కేంద్ర సర్వీసులకు వెళ్తున్నానంటూ నాపై వస్తున్న వార్తలు అవాస్తవం. అవి నిరాధారం. తెలంగాణ ప్రభుత్వం నాకు ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తా.. రాష్ట్ర ప్రయాణంలో భాగమైనందుకు గర్వపడుతున్నా..’ అని ‘ఎక్స్‌’ వేదికగా వివరణ ఇచ్చారు.

Updated Date - Dec 14 , 2023 | 04:05 AM