Share News

ఉపాధ్యాయులు లేక.. చదువులు సాగక తడబడి

ABN , Publish Date - Dec 28 , 2023 | 12:27 AM

2023లో విద్యా సంవత్సరంలో విద్యార్థులు నామమాత్రపు విద్యతోనే సరిపెట్టుకున్నారు.

ఉపాధ్యాయులు లేక.. చదువులు సాగక తడబడి

నామమాత్రపు విద్యతోనే విద్యా సంవత్సరం సరి8 సకాలంలో అందని పాఠ్యపుస్తకాలు

అమలుకు నోచని ‘మన ఊరు, మన బడి’

‘పది’ విద్యార్థులకు పూర్తికాని లక్ష్య ప్రణాళిక

2023లో విద్యా సంవత్సరంలో విద్యార్థులు నామమాత్రపు విద్యతోనే సరిపెట్టుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపోను ఉపాధ్యాయ నియామకం కాలేదు. పాఠ్యపుస్తకాలు సకాలంలో అందలేదు. మన ఊరు మన బడి కార్యక్రమం సక్రమంగా అమలు కాలేదు. స్కావెంజర్ల, నైట్‌వైచ్‌మన్లు లేకపోవడం, ప్రైవేట్‌ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందని వైనం. యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో పైచదువులకు దూర విద్యార్థులు దూరమయ్యారు.

- కోదాడ.

కరోనా దెబ్బతో 2019-20, 2020-21, 2021-22 విద్యా సంవత్సరాల్లో చదువులు అటకెక్కాయి. దీంతో విద్యారంగం అస్తవ్యస్తంగా మారింది. 2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ఆఫ్‌లైన్‌ తరగతులు నిర్వహించినా అందుకు సరిపడా సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులకు ప్రభుత్వ విద్య అందని ద్రాక్షలాగ మారింది. పాఠశాలలు ప్రారంభమై నెలలు గడస్తున్నా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికీ సుమారు వెయ్యి మంది ఉపాధ్యాయులు కొరత ఉంది. స్కావెంజర్లను నియమించలేదు. జూన్‌లో విద్యార్థులకు అందిచాల్సిన పాఠ్యపుస్తకాలు సెప్టెంబరులో పంపిణీ చేశారు. పీఎ్‌సల నుంచి హైస్కూల్స్‌కు డిప్యూటేషన్‌పై ఉపాధ్యాయులను పంపించడం, పీఎస్‌లలో పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడం, తరగతి గదికి ఒక టీచర్‌ ఉండాలనే నింబంధన అమలు కాకపోవడంతో పాటు, మన ఊరు- మన బడి కింద ఎంపికైన పాఠశాలల్లో ఆఫ్‌లైన్‌తోపాటు, డిజిటల్‌ తరగతులు నిర్వహించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే తలంపుతో రూ.30లక్షలతో కొనుగొలు చేసిన ఫర్నిచర్‌, బెంచీలు, ఎల్‌ఈడీ టీవీలను వాడలేదు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందలేదు. దీంతో విద్యార్థులు అరకొర చదుతుతోనే నెట్టుకురావాల్సి వస్తుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. పదో విద్యార్థులకు లక్ష్య పేరుతో డిసెంబరు నాటికి సిలబస్‌ పూర్తి చేసి, జనవరి, ఫిబ్రవరిలో సిలబస్‌ రివిజన్‌ చేసి, పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలనేది ప్రభుత్వ ప్రణాళిక. కానీ నేటికీ సిలబస్‌ పూర్తికాకపోవడం రివిజన్‌ ప్రశ్నార్థకమే అంటున్నారు ఉపాధ్యాయ సంఘ నేతలు. ఎనిమిది సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లేవు. ఐదు సంవత్సరాలుగా బదిలీలూ లేవు.

ఉమ్మడి జిల్లాలో 4,282 పాఠశాలలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 4,282 ప్రభు త్వ, ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. ఆయా విద్యాసంస్థల్లో సుమారు 4లక్షల విద్యార్థులు చదువుతున్నారు.

అందని పాఠ్యపుస్తకాలు

2023-24 విద్యసంవత్సరం జూన్‌లో ప్రారంభమైన పాఠ్యపుస్తకాల పంపిణీ సెప్టెంబరు చివర నాటికీ అం దడంతో నాలుగు నెలలు పాటు విద్యార్థులు నామమాత్రపు చదువులకే పరిమితం కావాల్సి వచ్చింది. పుస్తకాల లేమితో అటు విద్యార్థులు చదువుకోలేక, ఇటు ఉపాధ్యాయులు బోధన చేయలేక ఇబ్బంది పడే పరిస్ధితి నెలకొంది. పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సిలబస్‌ పూర్తికాక విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.

స్కావెంజర్లు లేక లోపించిన పారిశుధ్యం

పీఎ్‌సలలో పనిచేస్తున్న స్కావెంజర్లకు రూ2వేలు, హైస్కూల్స్‌లో పనిచేస్తున్న వారికి రూ2,500లు ప్రభుత్వం ఇచ్చేంది. వారు పాఠశాల తరగతి గదులను, మరుగుదోడ్లు శుభ్రపరిచి, విద్యార్థులు అంటురోగాలు గురికాకుండా చూసేవారు. కరోనా అనంతరం ప్రభుత్వం వారిని తొలగించి గ్రామాల్లో గ్రామపంచాయితీ సిబ్బంది, మునిసిపాలిటీలలో మునిసిపల్‌ సిబ్బందికి ఆ బాధ్యత అప్పగించింది. దీంతో ఆయా సిబ్బంది రోజు పాఠశాలలను శుభ్రపరచకపోవడంతో విద్యార్థులు పారిశుధ్య సమస్యను ఎదుర్కొవల్సి వస్తోంది.

అమలుకు నోచుకొని మన ఊరు, మన బడి

విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు, మౌలిక సదుపాయాలు అందించి, విద్యార్థులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మన ఊరు, మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎంపిక చేసిన పాఠశాలల్లో కా ర్యక్రమ అమలుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో భాగం గా విద్యార్థులకు కంప్యూటర్ల ఏర్పాటు, విద్యుత్‌ సదుపాయాలు, ఫ్యాన్లు, భోజన చేసేందుకు డైనింగ్‌హాల్‌ లాంటి సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. పథకం సక్రమంగా అమలు కాకపోవడంతో విద్యార్థులు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యం కనుచూపు మేర కన్పించడం లేదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

అందని ఉపకార వేతనాలు

ఉమ్మడి జిల్లాలో 220 జూనియర్‌, 85 డిగ్రీ, 42 ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్నా యి.ఆయా కళాశాలలో 2022-23 విద్యా సం వత్సరంలో బీసీ, ఈబీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, ఉపకారవేతనాలకు సుమారు లక్షా 90వేలమంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. 2023-24 విద్యా సంవత్సరం పూర్తి కావొస్తున్నా గత సంవత్సరం డిగ్రీ,ఇంజనీరింగ్‌, ఎంటెక్‌, ఎంబీఏ పూ ర్తిచేసిన విద్యార్థులకు నేటికి ఉపకార వేతనాలు అందలేదు. ఫీజులు చెల్లిం చి సర్టిఫికెట్స్‌ తీసుకెళ్లాలని యాజమాన్యాలు చెబతుండడంతో విద్యార్థులు ఫీజులు చెల్లించలేక, సర్టిఫికెట్స్‌ రాక ఉన్నత చదువులకు దూ రం అవుతున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మరో పక్కప్రభుత్వం కళాశాల యజమాన్యాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సం బంధించి టోకె న్లు ఇచ్చి నెలలు గడుస్తున్నా ట్రజరీల్లో డబ్బులు జమ కాకపోవటంతో కళాశాలలు నిర్వహించడం కష్టంగా ఉందని యజమాన్యాలు వాపోతున్నాయి.

ఉపాధ్యాయుల కొరత.. విద్యార్థుల చదువుపై ప్రభావం

ప్రభుత్వ పాఠశాలలో నియామకాలు చేపట్టకపోవడంతో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. హై స్కూల్స్‌లో ప్రత్యేక సబ్జెక్ట్స్‌ బోధించే ఉపాఽధ్యాయుల ను పీఎ్‌సల నుంచి డిప్యూటేషన్‌పై తరలించడంతో పీఎ్‌సలలో టీచర్ల కొరత ఉంది. ఉపాధ్యాయులు లే క పీఎ్‌సలలో విద్యార్థులకు సరైన విద్య అందడంలేదని చర్చ జరుగుతోంది. మరో పక్క విద్యా వలంటీ ర్ల తొలగింపుతో అనుకున్న మేర విద్యార్ధులకు నా ణ్యమైన విద్యకు దూరం అవుతున్నారని విద్య నిపుణులు పేర్కొంటున్నారు. మరో పక్కా పీఎ్‌సల నుం చి డిప్యూటేషన్‌పై తరలించిన ఉపాధ్యాయులకు ఇంగ్లీషు, మాథ్స్‌, ఫిజిక్స్‌, బయాలజీ సబ్జక్టులపై పట్టులేకపోవటంతో 8,9,10 విద్యార్థులకు సరైన బో ధన ఉండడంలేదు. 2015నుంచి ఉపాధ్యాయులకు పదోన్నతలు లేవని, 2018 నుంచి బదిలీలు లేవని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.

ఏకోపాధ్యాయ పాఠశాలలో విద్యార్థులకు తప్పని ఇబ్బందులు

ఏకోపాఽధ్యాయ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తరగతుల న్విహణ, పాఠ్య ప్రణాళిక, వార్షిక నివేదికలు తయారీకే సమయం సరిపోతుంది. ఫలితంగా ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నామమాత్ర చదువే లభిస్తుందంటున్నారు.

Updated Date - Dec 28 , 2023 | 12:27 AM