రాయలసీమను తెలంగాణలో కలిపితే దేశంలోనే మనది అగ్ర రాష్ట్రం
ABN , First Publish Date - 2023-04-26T03:02:38+05:30 IST
ఏపీ ప్రాంత నాయకులు, ప్రజలు కోరుతున్నట్లుగా రాయలసీమను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణను ఏర్పాటు చేస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.
ఏపీ ప్రభుత్వ వైఫల్యంతోనే తెరపైకి రాయల తెలంగాణ
కేసీఆర్ నాయకత్వంతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యం
రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
చివ్వెంల, ఏప్రిల్ 25: ఏపీ ప్రాంత నాయకులు, ప్రజలు కోరుతున్నట్లుగా రాయలసీమను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణను ఏర్పాటు చేస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన సూర్యాపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్ ప్లీనరీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యంతోనే రాయల తెలంగాణ అంశం తెరపైకి వచ్చిందన్నారు. అయితే, ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణ ఇప్పుడు సాధ్యం కావన్నారు. ఏపీ ప్రజలు రాయల తెలంగాణ అంశాన్ని వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్‌లో సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేలా ఆలోచన చేయాలని జగదీశ్‌రెడ్డి సూచించారు. బంగారు తెలంగాణ మాదిరిగా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు.