మళ్లీ కేసీఆర్‌ మాటలు నమ్మితే అంతే: షర్మిల

ABN , First Publish Date - 2023-05-27T03:46:58+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో సీఎం కేసీఆర్‌ మళ్లీ గిమ్మిక్కులు బయటపెడుతున్నారని, ఓట్లకోసం కొత్త పథకాలకు తెరలేపుతున్నారని వైఎస్‌ఆర్టీపీ అధినేత్రి షర్మిల అన్నారు.

మళ్లీ కేసీఆర్‌ మాటలు నమ్మితే అంతే: షర్మిల

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో సీఎం కేసీఆర్‌ మళ్లీ గిమ్మిక్కులు బయటపెడుతున్నారని, ఓట్లకోసం కొత్త పథకాలకు తెరలేపుతున్నారని వైఎస్‌ఆర్టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. ఆయన మాటలను ప్రజలు మళ్లీ నమ్మితే మిగిలేది గుండు సున్నానేనని పేర్కొన్నారు. ఇళ్లకు పైసలు, పోడు పట్టాలు, బీసీలకు ఆర్థిక సాయం అంటూ సీఎం కేసీఆర్‌ ప్రకటించారని, ఆయన చెప్పేది బారాణా అయితే ఇచ్చేది చారాణా మందం కూడా ఉండదని విమర్శించారు. తొమ్మిదేళ్లుగా బీసీలను నిండా ముంచారని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ట్వీట్‌ చేశారు.

Updated Date - 2023-05-27T03:46:58+05:30 IST