Ramakrishna Math: హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన స్వామి గౌతమానంద

ABN , First Publish Date - 2023-01-29T21:09:27+05:30 IST

బేలూరు రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ ఉపాధ్యక్షులు స్వామి గౌతమానంద హైదరాబాద్ పర్యటనకు విచ్చేశారు.

Ramakrishna Math: హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన స్వామి గౌతమానంద
Vice President of Swami Gautamanandaand Ramakrishna Mission, Belur Math Hyderabad Tour

హైదరాబాద్: బేలూరు రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ ఉపాధ్యక్షులు స్వామి గౌతమానంద హైదరాబాద్ పర్యటనకు విచ్చేశారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం, వివేకానంద ఆడిటోరియంలో ఫిబ్రవరి నాలుగో తేదీ శనివారం సాయంత్రం 5 గంటలా 45 నిమిషాలకు ఆయన ప్రసంగం ఉంటుంది. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 వరకూ స్వామి గౌతమానంద భక్తులకు ఆశీస్సులు అందజేస్తారని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద తెలిపారు. స్వామి గౌతమానంద హైదరాబాద్ పర్యటన సందర్భంగా రామకృష్ణ మఠంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని స్వామి బోధమయానంద పిలుపునిచ్చారు.

హైదరాబాద్ రామకృష్ణ మఠంలో అనేక భాషలతో పాటు వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు కూడా నిరంతరం నిర్వహిస్తున్నారు. మఠంలో జరిగే వివిధ కోర్సుల్లో చేరాలనుకునేవారు 040-27627961 నెంబర్‌కు కాల్ చేయవచ్చు. 9177232696 వాట్సాప్ నెంబర్‌ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. https://rkmath.org/vihe/ ద్వారా ఆన్‌లైన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. రామకృష్ణ మఠం పనివేళలు ఉదయం ఎనిమిదిన్నర నుంచి పదకొండున్నర వరకూ అలాగే సాయంత్రం నాలుగున్నర నుంచి ఏడున్నర వరకూ.

Updated Date - 2023-01-29T21:09:33+05:30 IST