Aaryajanani: ఈ నెల 12న ఆర్యజనని ఐదో వార్షికోత్సవం

ABN , First Publish Date - 2023-03-07T22:37:09+05:30 IST

రామకృష్ణ మఠం ద్వారా గర్భిణులకు మార్గదర్శనం చేస్తున్న ఆర్యజనని ఈ నెల 12న ఐదో వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది.

Aaryajanani: ఈ నెల 12న ఆర్యజనని ఐదో వార్షికోత్సవం
Aaryajanani fifth anniversary celebrations in Hyderabad

హైదరాబాద్: రామకృష్ణ మఠం(Ramakrishna Math) ద్వారా గర్భిణులకు మార్గదర్శనం చేస్తున్న ఆర్యజనని(Aaryajanani) ఈ నెల 12న ఐదో వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. హైదరాబాద్ రామకృష్ణ మఠంలోని ఆడిటోరియంలో వేడుకలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. వార్షికోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని ఆర్యజనని ఇంఛార్జ్ డాక్టర్ అనుపమారెడ్డి తెలిపారు. వార్షికోత్సవ వేళ తెలంగాణ నలుమూలల నుంచి ఆర్యజనని టీమ్ మెంబర్లతో పాటు పలువురు మేధావులు, విద్యావంతులు, డాక్టర్లు హాజరౌతారని చెప్పారు.

ఆర్యజననిలో ఓ మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు రెండేళ్ళ వయసు వచ్చే వరకు అంటే 1,000 రోజుల వరకు గర్భిణులు పాటించవలసిన సూచనలను గైనకాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు గర్భిణులకు వివరిస్తారు.

ప్రసవానికి ముందు యోగా, గాఢమైన విశ్రాంతి, శ్వాసించడం, ధ్యానం వంటివాటికి సంబంధించిన శక్తిమంతమైన చిట్కాలను తెలియజేస్తారు. బిడ్డను పోషించడం, చనుబాలు ఇవ్వడం, శిశువుకు పోషకాహారం గురించి సమగ్ర సమాచారం ఇస్తారు. గర్భధారణ, మాతృత్వం గురించి ప్రయోజనకరమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు నిపుణులతో మాట్లాడవచ్చునని, అనుభవజ్ఞులైన దంపతులు, తల్లులతో సంభాషించవచ్చునని ఆర్యజనని నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వివరాలకు https://aaryajanani.org/ వెబ్‌సైట్‌తో పాటు 9603906906 వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2023-03-07T22:37:13+05:30 IST