Ramakrishna Mission: నవ భారత నిర్మాణంలో రామకృష్ణ మిషన్ పాత్ర కీలకం: స్వామి బోధమయానంద

ABN , First Publish Date - 2023-05-01T20:18:48+05:30 IST

పురోగమిస్తున్న నవ భారత నిర్మాణంలో రామకృష్ణ మిషన్ పాత్ర కీలకమని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు.

Ramakrishna Mission: నవ భారత నిర్మాణంలో రామకృష్ణ మిషన్ పాత్ర కీలకం: స్వామి బోధమయానంద
Hyderabad Ramakrishna Math president Swami Bodhamayananda

హైదరాబాద్: పురోగమిస్తున్న నవ భారత నిర్మాణంలో రామకృష్ణ మిషన్ (Ramakrishna Mission) పాత్ర కీలకమని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు (Hyd Ramakrishna Math) స్వామి బోధమయానంద (Swami Bodhamayananda) చెప్పారు. యువతలో దేశభక్తి పెంపొందింపచేయడంలో రామకృష్ణ మిషన్ కీలక పాత్ర పోషించిందన్నారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ (Vivekananda Institute Of Human Excellence) వెంకటేశ్వరహాల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

కార్యక్రమానికి మైసూరుకు చెందిన కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సభ్యులు డాక్టర్ ఆర్. బాలసుబ్రహ్మణ్యమ్ ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. త్యాగము, సేవ ద్వారా దేశ నిర్మాణానికి నడుం కట్టేలా రామకృష్ణ మిషన్ యువతను ప్రోత్సహించిందని ఆయన చెప్పారు.

కార్యక్రమంలో రాజస్థాన్‌కు చెందిన ఖేత్రి రామకృష్ణ మిషన్ కార్యదర్శి ఆత్మనిష్టామహరాజ్, స్వామి యోగీశానంద, సంతోష్ మహరాజ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగ్యనగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2023-05-01T20:18:52+05:30 IST