Share News

ఫేక్‌ వార్తలపై కేసుల్లో హైదరాబాదే టాప్‌

ABN , Publish Date - Dec 17 , 2023 | 04:30 AM

తప్పుడు వార్తలకు సంబంధించి నమోదైన కేసుల్లో దేశంలోని 19 మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉంది. 2022 ఏడాదికి సంబంధించి నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో రికార్డ్స్‌ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

ఫేక్‌ వార్తలపై కేసుల్లో హైదరాబాదే టాప్‌

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): తప్పుడు వార్తలకు సంబంధించి నమోదైన కేసుల్లో దేశంలోని 19 మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉంది. 2022 ఏడాదికి సంబంధించి నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో రికార్డ్స్‌ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్‌, ఢిల్లీ, ఘజియాబాద్‌, హైదరాబాద్‌, ఇండోర్‌, జైపూర్‌, కాన్పూర్‌, కోచి, కోల్‌కతా, కోజికోడ్‌, లక్నో, ముంబై, నాగ్‌పూర్‌, పట్నా, పుణె, సూరత్‌ తదితర మెట్రో నగరాల్లో 2022లో ఫేక్‌ న్యూస్‌కు సంబంధించి 97 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా 57 కేసులు హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. అత్తింటి వేధింపులు..గృహ హింస చట్టం కింద నమోదైన కేసుల్లో హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది. దేశంలోని 19 మెట్రో నగరాల్లో గత ఏడాది 15,913 గృహహింస కేసులు నమోదయ్యాయి. ఇందులో 4,876 కేసులతో ఢిల్లీ తొలి స్థానంలో ఉంది. తర్వాత హైదరాబాద్‌లో అత్యధికంగా 1577 కేసులు నమోదయ్యాయి.

Updated Date - Dec 17 , 2023 | 04:30 AM