ఎమ్మెల్యే చెప్పిన వారికే బీసీ బంధు ఎలా ఇస్తారు?
ABN , First Publish Date - 2023-07-29T03:01:59+05:30 IST
బీసీ బంధు పథకాన్ని అర్హులైన వారికి కాదని.. ఎమ్మెల్యే చెప్పిన వారికి ఎలా ఇస్తారని నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో డీఆర్‌వో లోకే్‌షను దరఖాస్తుదారులు నిలదీశారు.
లబ్ధిదారులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు?
ఖానాపూర్‌లో డీఆర్‌వోను నిలదీసిన దరఖాస్తుదారులు
ఖానాపూర్, జూలై 28: బీసీ బంధు పథకాన్ని అర్హులైన వారికి కాదని.. ఎమ్మెల్యే చెప్పిన వారికి ఎలా ఇస్తారని నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో డీఆర్‌వో లోకే్‌షను దరఖాస్తుదారులు నిలదీశారు. ఖానాపూర్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ద్వారా 50 మందికి మంజూరైన బీసీ బంధు చెక్కులను స్థానిక ఎమ్మెల్యే రేఖానాయక్ లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఖానాపూర్‌కు చెంది న పలువురు బీసీ బంధు దరఖాస్తుదారులు ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. బీసీ బంధు లబ్ధిదారులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో తెలపాలని డీఆర్‌వో లోకే్‌షను నిలదీశారు. ఎమ్మెల్యే వద్ద ఫైనల్ చేసి తమకు ఇచ్చిన జాబితాలో ఉన్న పేర్లకే తాము బీసీ బంధు అందజేశామని డీఆర్‌వో సమాధానం ఇచ్చారు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో జరిగిన అవకతవకలను ఎందుకు పట్టించుకోలేదని కాంగ్రెస్, బీజేపీ నాయకులు డీఆర్‌వోపై ఆగ్రహం వ్యక్తం చేశారు.