గీతకార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం : పల్లె

ABN , First Publish Date - 2023-06-26T01:05:51+05:30 IST

గీతకార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని కల్లుగీత పారిశ్రామిక సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పల్లె రవికుమార్‌ అన్నారు. చౌటుప్పల్‌ మునిసిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన లింగాల జంగయ్యగౌడ్‌ తాటిచెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. అతడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.5లక్షలు మంజూరయ్యాయి.

గీతకార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం : పల్లె

చౌటుప్పల్‌, సంస్థాన్‌నారాయణపురం, జూన్‌ 25: గీతకార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని కల్లుగీత పారిశ్రామిక సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పల్లె రవికుమార్‌ అన్నారు. చౌటుప్పల్‌ మునిసిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన లింగాల జంగయ్యగౌడ్‌ తాటిచెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. అతడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.5లక్షలు మంజూరయ్యాయి. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన ఇట్టగోని ముత్యాలు తాటిచెట్టుపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడికి రూ.5లక్షలు మంజూరయ్యాయి. సంస్థాన్‌ నారాయణపురం మండలం అల్లందేవిచెరువు గ్రామంలో గీత కార్మికుడు సుర్వి నర్సింహ తాటిచెట్టు ఎక్కుతూ జారి పడి తీవ్ర గాయాలకు గురికాగా, రూ.5లక్షలు మంజూరయ్యాయి. ఈ చెక్కులను బాధిత కుటుంబాలకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ, గీత వృత్తిని ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్‌ కిషోర్‌, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్య, సుర్వి లింగస్వామి, సిద్దగోని శ్రీనివాస్‌, రాఘవేందర్‌, గౌడ సంఘం నాయకులు బడేటి సత్యనారాయణగౌడ్‌, ముస్తాదర్‌ బి.సత్యనారాయణ, చేకూరి ఈదయ్య, కంచర్ల మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T01:05:51+05:30 IST