కౌశిక్‌రెడ్డి తీరుపై సీఎంకు ఫిర్యాదు చేస్తా
ABN , First Publish Date - 2023-06-26T03:53:38+05:30 IST
తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీల పట్ల ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అనుసరిస్తున్న తీరు అధికార పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఉందని, ఈ అంశంపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తానని ఆదిలాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జోగు తెలిపారు.....
ముదిరాజ్‌ల పట్ల అనుచితమైన వ్యాఖ్యలు సరికావు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీల పట్ల ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అనుసరిస్తున్న తీరు అధికార పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఉందని, ఈ అంశంపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తానని ఆదిలాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జోగు తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ముదిరాజ్ మహాసభ ప్రతినిధులు జోగు రామన్నను కలిశారు. ముదిరాజ్‌లను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామన్న స్పందిస్తూ.. వ్యక్తిగత కోపాలను వ్యవస్థపై రుద్దితే సహించేదిలేదని, ముదిరాజ్ సామాజిక వర్గంపై ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు.