HARISHRAO : కాంగ్రెసోళ్లకు దిమాక్‌ లేదు

ABN , First Publish Date - 2023-06-01T03:45:38+05:30 IST

‘‘కాంగ్రెస్‌ వాళ్లకు దిమాక్‌ పనిచేయడం లేదు. అభివృద్ధి పనుల కోసం ఎక్కడైనా అప్పు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే ష్యూరిటీ పడుతుంది. ప్రభుత్వమే ఆ అప్పు చెల్లిస్తుంది. మధ్యలో కాంగ్రెస్‌ వాళ్లకు వచ్చిన ఇబ్బందేంటి?’’ అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశరావు అన్నారుు.

HARISHRAO : కాంగ్రెసోళ్లకు దిమాక్‌ లేదు

అప్పు తీసుకుంటే చెల్లించేది ప్రభుత్వమే కదా!

బిల్లుల అంశం గవర్నర్‌ విజ్ఞతకే వదిలేస్తున్నాం

వైద్యం కోసం వరంగల్‌కు రావాలి

దసరా వరకు హెల్త్‌ సిటీ అందుబాటులోకి

కార్పొరేట్‌ కొమ్ము కాస్తున్న కేంద్రం: హరీశరావు

ఓరుగల్లు/హనుమకొండ టౌన, మే 31 (ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రెస్‌ వాళ్లకు దిమాక్‌ పనిచేయడం లేదు. అభివృద్ధి పనుల కోసం ఎక్కడైనా అప్పు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే ష్యూరిటీ పడుతుంది. ప్రభుత్వమే ఆ అప్పు చెల్లిస్తుంది. మధ్యలో కాంగ్రెస్‌ వాళ్లకు వచ్చిన ఇబ్బందేంటి?’’ అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశరావు అన్నారుు. వరంగల్‌ నగరంలో పర్యటించిన మంత్రి.. హంటర్‌రోడ్‌లోని ఫాదర్‌ కొలంబో ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌సను, ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ సెంటర్‌ను, కాకతీయ మెడికల్‌ కళాశాలలో అకడమిక్‌ బ్లాక్‌ను ప్రారంభించారు. హెల్త్‌సిటీ పనులను పరిశీలించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పదేళ్లు కాంగ్రెస్‌ పార్టీయే రాష్ట్రాన్ని పరిపాలించిందని, అప్పుడెందుకు అభివృద్ధి పనులు చేపట్టలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మిస్తున్నప్పుడు రియల్‌ ఎస్టేట్‌ కోసం కడుతున్నారంటూ తప్పుడు మాటలు మాట్లాడారని విమర్శించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా సస్యశ్యామలంగా ఉండటానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కాదా? అని ప్రశ్నించారు.

ప్రొఫెసర్ల వయసు 65 ఏళ్లుండి సూపరింటెండెంట్‌లు, ప్రిన్సిపాళ్ల ఉద్యోగ విరమణ వయసు 61 ఏళ్లుండడం ఏవిధంగా సమంజసమని హరీశ వ్యాఖ్యానించారు. వారి వయసును పెంచుతూ బిల్లును గవర్నర్‌కు పంపిస్తే.. ఒక డాక్టర్‌గా గవర్నర్‌ తమిళిసై ఆమోదించాల్సి పోయి అందుకు భిన్నంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. ఈ విషయాన్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. వరంగల్‌ సెంట్రల్‌ జైలు ఆవరణలో నిర్మిస్తున్న హెల్త్‌ సిటీ సేవలు ప్రారంభమైతే.. వైద్యం కోసం హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు రావాల్సి ఉంటుందని మంత్రి హరీశ అన్నారు. వచ్చే దసరా వరకు హెల్త్‌ సిటీ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కేంద్రం కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ము కాస్తూ కార్మికుల పొట్ట కొడుతోందని హరీశ ఆరోపించారు. కార్మిక మాసోత్సవం ముగింపు సందర్భంగా సుబేదారిలో నిర్వహించిన కార్మిక యుద్ధభేరి సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అంగట్లో సరుకులా తెగనమ్ముతూ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

Updated Date - 2023-06-01T03:59:09+05:30 IST