KTR : ‘ఎక్స్’ వేదికగా భార్యకు కేటీఆర్ పెళ్లి రోజు శుభాకాంక్షలు
ABN , Publish Date - Dec 19 , 2023 | 03:04 AM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ 20వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం తన శ్రీమతి శైలిమకు ఎక్స్ (ట్విటర్) వేదికగా
హైదరాబాద్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ 20వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం తన శ్రీమతి శైలిమకు ఎక్స్ (ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రెండు దశాబ్దాల పాటు కొండంత అండగా నిలిచినందుకు, నాకు ఇద్దరు అందమైన పిల్లలను అందించినందుకు, నా జీవితంలో గొప్ప భాగస్వామిగా ఉన్నందుకు ధన్యవాదాలు. మనం ఇలాగే కలకాలం కలిసుండాలి’’ అని పోస్టు చేశారు. ఈ సందర్భంగా తన పెళ్లినాటి చిత్రంతో పాటు తన కుటుంబంతో కలిసి ఉన్న మరో ఫొటోను కూడా పోస్టు చేశారు.