వైభవంగా హనుమ జయంతి

ABN , First Publish Date - 2023-05-15T00:55:02+05:30 IST

హనుమ జయంతిని జిల్లా వ్యాప్తంగా భక్తులు ఆదివారం వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని భక్తాంజనేయస్వామి, విజయాంజనేయస్వామి, వేంకటేశ్వరస్వా మి, శ్రీసంతోషిమాత దేవాలయాల్లో అర్చకులు వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తాంజనేయస్వామి ఆలయంలో సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆంజనేయుడికి నాగవల్లి దళార్చన, వెండి తమలపాకులతో అర్చనలు నిర్వహించి పతాకావిష్కరణ చేశారు.

వైభవంగా హనుమ జయంతి

సూర్యాపేట కల్చరల్‌, మే 14: హనుమ జయంతిని జిల్లా వ్యాప్తంగా భక్తులు ఆదివారం వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని భక్తాంజనేయస్వామి, విజయాంజనేయస్వామి, వేంకటేశ్వరస్వా మి, శ్రీసంతోషిమాత దేవాలయాల్లో అర్చకులు వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తాంజనేయస్వామి ఆలయంలో సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆంజనేయుడికి నాగవల్లి దళార్చన, వెండి తమలపాకులతో అర్చనలు నిర్వహించి పతాకావిష్కరణ చేశారు. అనంతరం సుందరాకాండ, విష్ణు సహస్రనామ, భగవద్గీత, హనుమాన్‌ చాలీసా పారాయణాలు చేశారు. భక్తులు తెల్లవారుజామునుంచే పెద్ద సంఖ్య లో దేవాలయాలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని పూజల్లో పాల్గొన్నారు. భక్తాంజనేయస్వామి దేవాలయంలో కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావ్‌, డీఎస్పీ నాగభూషణం దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో భక్తాంజనేయస్వామి దేవాలయ ఈవో ఎంపీ లక్ష్మణ్‌రావు, కొత్త ఆంజనేయులు, మొరిశెట్టి శ్రీనివాస్‌, వెంపటి సురేష్‌, గండూరి కృపాకర్‌, గండూరి రమేష్‌, దరూరి శ్రీధరాచార్యులు, శ్రీనాధాచార్యులు, పవన్‌కుమార్‌ ఆచార్యులు, సంతోష్‌ ఆచార్యులు, సముద్రాల చక్రధరచార్యులు, కీసర దేవేంద్ర, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-15T00:55:02+05:30 IST