ఘనంగా గురుదత్త జయంతి
ABN , Publish Date - Dec 26 , 2023 | 10:58 PM
మోమిన్‌పేట్ మండల కేంద్రంలో శ్రీగురుదత్త జయంతిని ఘనంగా నిర్వహించారు.
మోమిన్‌పేట్, డిసెంబరు 26: మోమిన్‌పేట్ మండల కేంద్రంలో శ్రీగురుదత్త జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీమాణిక్య ప్రభు ఆలయం నుంచి పురవీధుల మీదుగా మంగళవారం దత్తాత్రేయస్వామి పల్లకీ సేవ నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు.