‘గూడూరు’ ఫౌండేషన్‌ పేదలకు అండ

ABN , First Publish Date - 2023-02-27T01:02:21+05:30 IST

ఆర్థి క స్థోమత లేని నిరుపేద కుటుంబాలకు గూడూరు ఫౌండేషన్‌ అండగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర నాయకులు, ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు గూడూరు నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం నారాయణరెడ్డి పుట్టినరోజు సందర్భంగా గూడూరు టోల్‌ ప్లాజా వద్ద జయ గార్డెన్‌లో ఫౌండేషన్‌ ప్రతినిధులు అభిమానులు ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

‘గూడూరు’ ఫౌండేషన్‌ పేదలకు అండ

బీజేపీ రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి

బీబీనగర్‌, ఫిబ్రవరి 26: ఆర్థి క స్థోమత లేని నిరుపేద కుటుంబాలకు గూడూరు ఫౌండేషన్‌ అండగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర నాయకులు, ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు గూడూరు నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం నారాయణరెడ్డి పుట్టినరోజు సందర్భంగా గూడూరు టోల్‌ ప్లాజా వద్ద జయ గార్డెన్‌లో ఫౌండేషన్‌ ప్రతినిధులు అభిమానులు ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. అనంతరం కరోనా కష్టకాలంలో సేవలందించిన ఆరోగ్య సిబ్బంది, ఆశావర్కర్లు సుమారు 300 మందికి ప్రశంసాపత్రాలు, చీరలు అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు నారాయణరెడ్డి మాట్లాడుతూ ఆసక్తి ఉండి ఆర్థిక స్థోమత లేని ఎంతో మంది పిల్లల చదువుల కోసం ఫౌండేషన్‌ చేయూతనిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వందలాది మంది చేతివృత్తిదారులకు ఆధునిక పనిముట్లు యంత్ర సామ గ్రి అందజేశామన్నారు. ఫౌండేషన్‌ ద్వారా 800మందికి పీఎ్‌సఆర్‌ కోచింగ్‌ సెంటర్‌ ద్వారా ఎస్‌ఐ, కానిస్టేబుల్స్‌ ఉద్యోగాల కోసం శిక్షణ ఇప్పించామని, అందులో 270 మంది మెయిన్స్‌కు అర్హత సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పొట్టోళ్ల శ్యాంగౌడ్‌, పా శం భాస్కర్‌, పడమటి జగన్మోహన్‌రెడ్డి, వేముల అశోక్‌, శ్రీనివా్‌సగౌడ్‌, చిక్క కృష్ణ, శివకుమార్‌, నరోత్తమ్‌రెడ్డి, జంగారెడ్డి, సత్యంగౌడ్‌, సతీ్‌షనాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-27T01:02:22+05:30 IST