గోపలాయపల్లిలో ఘనంగా సుదర్శనహోమం
ABN , Publish Date - Dec 26 , 2023 | 12:04 AM
రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని మండలంలోని గో పలాయపల్లి వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానం లో సోమవారం సుదర్శన హోమాన్ని ఘనంగా నిర్వహించారు.
గోపలాయపల్లిలో ఘనంగా సుదర్శనహోమం
నార్కట్‌పల్లి, డిసెంబరు 25: రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని మండలంలోని గో పలాయపల్లి వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానం లో సోమవారం సుదర్శన హోమాన్ని ఘనంగా నిర్వహించారు. లోక కల్యాణార్థమై ప్రతీ మాసం లో రోహిణి నక్షత్రం రోజున ఈ దేవాలయంలో సుదర్శన యాగాన్ని కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. హోమం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవంలో దేవస్థాన అనువంశిక ధర్మకర్త కోమటిరెడ్డి మోహనరెడ్డి తదితర భక్తులు పాల్గొన్నారు.