31 నుంచి పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్ నర్సరీ మేళా
ABN , First Publish Date - 2023-08-29T04:19:55+05:30 IST
ఆల్ ఇండియా హార్టికల్చర్, అగ్రికల్చర్ షోను ఈ నెల 31 నుంచి నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు. ఈమేరకు 14వ గ్రాండ్ నర్సరీ మేళా బ్రోచర్‌ను మంత్రి హరీశ్‌రావు సోమవారం విడుదల చేశారు. 6 రోజులపాటు నిర్వహించే ఈ మేళాలో
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ఆల్ ఇండియా హార్టికల్చర్, అగ్రికల్చర్ షోను ఈ నెల 31 నుంచి నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు. ఈమేరకు 14వ గ్రాండ్ నర్సరీ మేళా బ్రోచర్‌ను మంత్రి హరీశ్‌రావు సోమవారం విడుదల చేశారు. 6 రోజులపాటు నిర్వహించే ఈ మేళాలో హార్టికల్చర్ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల తోటలు, ఎరువులు, ఆర్గానిక్ ఉత్పత్తులు, అగ్రికల్చర్ ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ సైన్స్, ఎడ్యుకేషన్, ఆహార పరిశ్రమ ఉత్పత్తులు ప్రదర్శిస్తారు. హాట్ క్లైమెట్ యాపిల్, డ్రాగన్ ఫ్రూట్, కొత్త రకం మొక్కలు, హైడ్రోఫోనిక్ టెర్రస్ గార్డెనింగ్ ప్రదర్శిస్తున్నారు. డార్జిలింగ్, కోల్‌కతా, ఢిల్లీ, హరియాణా, గుజరాత్, ముంబై, పూణె, బెంగళూరు, చెన్నై, కడియం ప్రాంతాల నుంచి నర్సరీ మేళాకు తరలివస్తున్నట్లు మేళా ఇన్‌ఛార్జి ఖలీల్ అహ్మద్ తెలిపారు.