గవర్నర్‌కు ఆటా వేడుకల ఆహ్వానం
ABN , First Publish Date - 2023-12-10T04:00:38+05:30 IST
అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) వేడుకలకు హాజరు కావాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఆహ్వానం అందింది.
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) వేడుకలకు హాజరు కావాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఆహ్వానం అందింది. ఆటా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సంయుక్తంగా నిర్వహించే వేడుకలకు హాజరు కావాలని గవర్నర్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు. ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, సీఐఐ తెలంగాణ చైర్మన్ సి.శేఖర్‌రెడ్డి, ఆటా బిజినెస్ చైర్‌పర్సన్ లక్ష్ చేపూరి గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో శనివారం కలిసి ఆహ్వానం అందజేశారు.