పేదలకు మంచి చేయడమే ప్రభుత్వ లక్ష్యం
ABN , First Publish Date - 2023-12-11T00:29:13+05:30 IST
మహిళలు, పేద ప్రజల కు మంచి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
పేదలకు మంచి చేయడమే ప్రభుత్వ లక్ష్యం
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
మునుగోడు, మర్రిగూడ, డిసెంబరు 10: మహిళలు, పేద ప్రజల కు మంచి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మునుగోడులో ఆదివారం నిర్వహించిన పలు కా ర్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రజా ప్రభుత్వమని అన్నారు. ఎన్నికల హామీలో భాగంగా ఆరు హామీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఆర్టీసీ బస్సులో మహిళల కు ఉచిత బస్సు ప్రయాణాన్ని స్థానిక అమరవీరుల స్మారక చౌ రస్తాలో ప్రారంభించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10లక్షలకు పెంచే పోస్టర్లను జడ్పీ సీ ఈవో ప్రేమ్‌కరణరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు పథకాలు ఎంతో గొప్పవన్నారు. అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్యన జరిగిన పోరాటంలో ధర్మమే గెలిచిందని, అదే కాంగ్రెస్ అని పేర్కొన్నారు. ఎవరికైనా అధికారమనేది శాశ్వ తం కాదని గుర్తుంచుకోవాలని సూచించారు. అధికారులు పక్షపాత ధోరణిలో ఉండకుండా న్యాయబద్ధంగా తమ విధులు నిర్వర్తించి ప్రజలకు సేవలందించాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను అర్హులైన పేదలకు అందేలా కృషి చేయాలన్నారు.
2 లక్షల ఎకరాలకు సాగునీరు
మునుగోడు నియోజకవర్గంలోని చర్లగూడెం లక్ష్మాపురం రిజర్వాయర్ పనులను పూర్తిచేసి 2లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మునుగోడు క్యాంపు కార్యాలయంలో రాజగోపాల్‌రెడ్డిని చర్లగూడెం రిజర్వాయర్ భూనిర్వాసితులు మర్యాదపూర్వకంగా కలి శారు. మాకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు స్పందించిన ఎమ్మె ల్యే రాజగోపాల్‌రెడ్డి డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్లగూడెం, ల క్ష్మణాపురం రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన ముంపు గ్రామాల భూ నిర్వాసితులు అధైర్యపడవద్దని, బాధితులకు ప్రభుత్వం న్యాయం జరిగే విధంగా చూస్తుందని భరోసా ఇచ్చారు.