Share News

ఫుట్‌బాల్‌ అసోసియేషన రాష్ట్ర కమిటీ సభ్యుడిగా గిరిబాబు

ABN , Publish Date - Dec 26 , 2023 | 11:33 PM

ఫుట్‌బాల్‌ అసోసియేషన రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన గిరిబాబు ఎన్నికయ్యారు.

ఫుట్‌బాల్‌ అసోసియేషన  రాష్ట్ర కమిటీ సభ్యుడిగా గిరిబాబు

నల్లగొండ స్పోర్ట్స్‌, డిసెంబరు 26 : ఫుట్‌బాల్‌ అసోసియేషన రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన గిరిబాబు ఎన్నికయ్యారు. హైదరాబాద్‌ నిజాం క్లబ్‌లో నిర్వహించిన తెలంగాణ ఫుట్‌బాల్‌ అసోసియేషన ఎన్నికల్లో ఆయన్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఉమ్మడి జిల్లాలో ఫుట్‌బాల్‌ క్రీడాభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తాన్నారు. తన ఎన్నికకు సహకరించిన ఫుట్‌బాల్‌ అసోసియేషన చైర్మన, డాక్టర్‌ కేటీ మహి, అధ్యక్షుడు మహ్మద్‌ రఫతఅలీ, ప్రధాన కార్యదర్శి పాల్గుణలకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Dec 26 , 2023 | 11:33 PM